Telugu song Lyrics
Nayi Dhoro Song Lyrics | Lyrics in Telugu
Nayi Dhoro Song lyrics: Nayi Dhoro Song is written and directed by Parvathi mahesh and the song is sang by Ramunipatla Lavanya, Boddu Dilip Kumar
Nayi Dhoro Song Lyrics
Nayi Dhoro Song Lyrics :
నమ్మినను ఉసిననురా నాయి దొరో
నా సక్కనొడో నా సెక్కరిలోన సెందురుడా
బుచ్చి బుర్రలైనరో నాయి దొరో
నా సక్కనొడో నా సెక్కరిలోన సెందురుడా
మేనత్త కొడుకు అంటే మేకల్లో కుక్క
మంది ఎంత సెప్పిన నువ్వే గావలాని
నమ్మినను ఉసిననురా నాయి దొరో
నా సక్కనొడో నా సెక్కరిలోన సెందురుడా
బుచ్చి బుర్రలైనరో నాయి దొరో
నా సక్కనొడో నా సెక్కరిలోన సెందురుడా
కట్టుకున్న బొమ్మరిల్లు కోట అమ్మ నాన్నల ఆట
నువ్వు నేను గూడి రాములోరి గుడి జేరి లగ్గం ఆడి
నన్ను నాడే పెండ్లి ఆడినవురో నాయి దొరో
నా సక్కనొడో నా సెక్కరిలోన సెందురుడా
అది అదికొస్తే సిగ్గులైయారో నాయి దొరో
నా సక్కనొడో నా సెక్కరిలోన సెందురుడా
ఈ సంత రమ్మంటే ఇల్లంత
నాదంటు గెలికినావు ప్రేమా ఒలికినావు
సూడ బుద్ది కాక నన్ను ఓర్వా లేక
నా ఎంటా పడి కొంట ఆట లాడి
మూలకున్న దాని ముంగట ఎత్తివిరో నాయి దొరో
నా సక్కనొడో నా సెక్కరిలోన సెందురుడా
ఇప్పుడెట్ల కానీ దానినైతిరో నాయి దొరో
నా సక్కనొడో నా సెక్కరిలోన సెందురుడా
పిలిసి పిల్లనిత్తే కులం లేనట్లు ఈడు కాక జోడు
కాక పడుసు తనం లేదా నీకు నచ్చలేదా మెచ్చలేద
మర్రి ఊడాల ఆట మరిసిన్నవా నాయి దొరో
నా సక్కనొడో నా సెక్కరిలోన సెందురుడా
నీ బుర్రెలా పురుగులు సొచ్చినయా నాయి దొరో
నా సక్కనొడో నా సెక్కరిలోన సెందురుడా
సేయు పట్టుకోని జంట గట్టుకొని మాట తప్పవాని
అన్ని ఒప్పుకోని కాట కలుపవాని కలలు కన్నదాని
మానాల గుట్టలను అడుగురో నాయి దొరో
నా సక్కనొడో నా సెక్కరిలోన సెందురుడా
నువ్వు ఎసినా ఒట్టుని మరువారో నాయి దొరో
నా సక్కనొడో నా సెక్కరిలోన సెందురుడా
మానాల గుట్టలను అడుగురో నాయి దొరో
నా సక్కనొడో నా సెక్కరిలోన సెందురుడా
నువ్వు ఎసినా ఒట్టుని మరువారో నాయి దొరో
నా సక్కనొడో నా సెక్కరిలోన సెందురుడ