Movie News

RRR మోషన్ పోస్టర్ టీజర్లో అతి పెద్ద తప్పు?? ఫైర్ అవుతున్న అభిమానులు….

అందరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా rrr టైటిల్ లోగోను విడుదల చేశారు. ఈ సినిమా ఎస్.ఎస్.రాజమౌళి, యంగ్ టైగర్ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ కాంబినేషన్‌లో అనగానే.. వాళ్లు ముగ్గురు పేర్లలోని ‘R’లను చేర్చి rrr అనే వర్కింగ్ టైటిల్‌ను బాగా ట్రెండ్ చేశారు. ఇది అందరికీ బాగా రీచ్ అవ్వడంతో అదే టైటిల్‌ను ఖరారు చేసినట్టు రాజమౌళి ప్రకటించారు.

ఈ సినిమాల్లో యంగ్ టైగర్ఎన్టీఆర్ కొమురం భీమ్, మెగా పవర్ స్టార్రామ్ చరణ్అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టుకి ‘రౌద్రం రణం రుధిరం’ పేరు ఖరారు చేశారు. టైటిల్ లోగో, మోషన్ పోస్టర్ బ్యౌగ్రౌండ్ స్కోర్ అదిరిపోయాయి. అంచనాలకు ఏమాత్రం అందకుండా జక్కన్న ఈ rrr ‘రౌద్రం రణం రుధిరం’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడని అర్థమవుతుంది. సినిమాను 2021 జనవరి 8న విడుదల చేయనున్నారు.

Also Read:

Army rally Guntur Recruitment in Telugu

NLC Recruitment in Telugu

CIPET Recruitment in Telugu

డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దానయ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ‘రౌద్రం రణం రుధిరం’ టైటిల్ లోగో, మోషన్ పోస్టర్‌ను ఐదు భాషలలో విడుదల చేశారు. తెలుగు లోగో, మోషన్ పోస్టర్ డీవీవీ మూవీస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా, తమిళ్.. జూనియర్ఎన్టీఆర్ ఆఫీషియల్ అనే ఛానల్ ద్వారా, హిందీ.. అజయ్ దేవగన్, కన్నడ.. వారాహి, మలయాళం.. ఆల్వేస్ రామ్ చరణ్ అనే యూట్యూబ్ ఛానళ్ల ద్వారా విడుదల చేశారు.

అయితే తాజాగా విడుదల చేసిన ఈ పోస్టర్ ను చుసిన నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ సినిమాలో రాంచరణ్, ఎన్టీఆర్ ఇద్దరు న్యాయం పోరాడుతూ ఉంటారు. కానీ ఈ సినిమా రౌద్రం రణం రుధిరం పోస్టర్ లో రౌద్రం టైటిల్లో రామ్ చరణ్ కుడివైపుకు పరుగులు పెడుతుంటాడు. ఇక రుధిరంలో జూనియర్ఎన్టీఆర్ ఫేస్ కూడా కుడివైపు తిరిగి ఉంటుంది. మధ్యలో రణం ఉంటుంది. దింతో ఎన్టీఆర్ కూడా రణం చేస్తారు కదా అతని మొహం ఎడమ వైపు చూస్తున్నట్లు ఉండాలి అంటూ నెటిజన్లు విమర్శలు గుపుతున్నారు.

Source: AP Herald

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close