Telugu song Lyrics

Manasa Manasa Song Lyrics | ‘మనసా మనసా’ సాంగ్ లిరిక్స్ | బ్యాచ్‌లర్స్

Manasa Manasa Song Lyrics: సిద్ శ్రీరామ్ ప్రస్తుతం సౌత్‌లో పాపులర్ సింగర్. ఆయన ఏ పాట పాడినా సంగీత ప్రియులు ఫిదా అయిపోతున్నారు. అంతలా ఆయన తన స్వరంతో మాయ చేస్తున్నారు. ఆయన అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో సినిమాలో పాట పాడినా.. ప్రదీప్ మాచిరాజు వంటి చిన్న హీరో చిత్రంలో పాట పాడినా పాపులారిటీ మాత్రం ఒకేలా ఉంటుంది. అదీ సిద్ శ్రీరామ్ మాయ. ఆయన పాడిన ‘సామజవరగమన’ పాట ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇటీవల ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాలోని సిద్ శ్రీరామ్ పాడిన ‘నీలి నీలి ఆకాశం’ పాట కూడా అంతే పాపులర్ అయ్యింది.

Manasa-Manasa-Song-Lyrics

ప‌ల్లవి
మ‌న‌సా మ‌న‌సా మ‌న‌సారా బ్రతిమాలా త‌న వ‌ల‌లో ప‌డ‌బోకే మ‌న‌సా..
పిలిచా అరిచా అయినా నువ్ విన‌కుండా త‌న‌వైపు వెల‌తావ మ‌న‌సా..
నా మాట అలుసా
నేనెవ‌రో తెలుసా
నాతోనే ఉంటావు న‌న్నే న‌డిపిస్తావు న‌న్నాడిపిస్తావే మ‌న‌సా..

మ‌న‌సా మ‌న‌సా మ‌న‌సారా బ్రతిమాలా త‌న వ‌ల‌లో ప‌డ‌బోకే మ‌న‌సా..
పిలిచా అరిచా అయినా నువ్ విన‌కుండా త‌న‌వైపు వెల‌తావ మ‌న‌సా..

చ‌ర‌ణం – 1
ఏముంది త‌న‌లోన గ‌మ్మత్తు అంటే
అది దాటి మ‌త్తేదో ఉందంటు అంటూ
త‌న‌క‌న్నా అందాలు ఉన్నాయి అంటే
అందానికే తాను ఆకాశ‌మంటూ
నువ్వే నా మాట.. హే…
నువ్వే నా మాట విన‌కుంటే మ‌న‌సా..
తానే నీ మాట వింటుందా ఆశ‌
నా మాట అలుసా.. నేనెవరో తెలుసా
నాతోనే ఉంటావు న‌న్నే న‌డిపిస్తావు నన్నాడిపిస్తావే మ‌న‌సా..

మ‌న‌సా మ‌న‌సా మ‌న‌సారా బ్రతిమాలా త‌న వ‌ల‌లో ప‌డ‌బోకే మ‌న‌సా..
పిలిచా అరిచా అయినా నువ్ విన‌కుండా త‌న‌వైపు వెల‌తావ మ‌న‌సా..

చ‌ర‌ణం – 2
తెలివంత నా సొంత‌మనుకుంటు తిరిగా
త‌న‌ముందు నుంచుంటే నా పేరు మ‌రిచా
ఆ మాట‌లే వింటు మ‌తిపోయి నిలిచా
బ‌దులెక్కలుంద‌ంటు ప్రతి చోట వెతికా
త‌న‌తో ఉండే… హే….
తనతో ఉండే ఒక్కొక్క నిమిషం మ‌ర‌లా మ‌ర‌లా పుడ‌తావా మ‌న‌సా
నా మాట అలుసా నేన‌వ‌రో తెలుసా
నాతోనే ఉంటావు న‌న్నే న‌డిపిస్తావు న‌న్నాడిపిస్తావే మ‌న‌సా..

మ‌న‌సా మ‌న‌సా మ‌న‌సారా బ్రతిమాలా త‌న వ‌ల‌లో ప‌డ‌బోకే మ‌న‌సా..
పిలిచా అరిచా అయినా నువ్ విన‌కుండా త‌న‌వైపు వెల‌తావ మ‌న‌సా..

ఇవి కూడా చుడండి:

Buttabomma Song Lyrics in Telugu

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close