MoviesTelugu song Lyrics

Maguva Maguva Song Lyrics in telugu | మగువా మగువా… |

Maguva Maguva Song Lyrics in telugu:మగువా మగువా… అనే పాట ’వకీల్ సాబ్’ సినిమాలోని పాట, దీనిని సీడ్ శ్రీరామ్ పాడారు, ఈ పాటకి రచయిత రామజోగయ్య సాస్ట్రీ ఈ పాటకి సంగీతాన్ని ఇచ్చింది స్ స్ తమన్.

maguva-maguva-song-lyrics-in-telugu

Maguva Maguva Song Lyrics in telugu:

గానం: సీడ్ శ్రీరామ్
రచయిత: రామజోగయ్య సాస్ట్రీ
సంగీతం: స్ స్ తమన్.

మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా..
మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా..

అటు ఇటు అన్నింటా, నువ్వే జగమంతా
పరుగులు తీస్తావు ఇంటా బయట…
అలుపని రవ్వంత అననే అనవంట…
వెలుగులు పూస్తావు వెళ్లే దారంత…
స.. గ.మ.ప.మ.గ.స… గ.మ.ప.మ.గ.స… గ.మ.ప.మ.గ… గ.మ.ప.మ.గ… గ.మ.ప.గ.స…

మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా..
మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా..

నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా…
నీ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా…
ప్రతి వరసలోను ప్రేమగా అల్లుకున్న బంధమా అంతులేని నీ శ్రమా అంచనాలకందునా…
ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా నీవులేని జగతిలో దీపమే వెలుగునా…

నీదగు లాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక మగవాడు పసివాడేగా…
ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా…

స.. గ.మ.ప.మ.గ.స… గ.మ.ప.మ.గ.స… గ.మ.ప.మ.గ… గ.మ.ప.మ.గ… గ.మ.ప.మ.గ.స…

మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా…
మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా…

Maguva Maguva telugu Video Song:

మర్రిన్ని పాటలకోసం క్లిక్ చేయండి

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close