Blog
Kulasekharapatnam: శ్రీహరికోట కాకుండా కులశేఖరపట్నం నుంచి రాకెట్ ప్రయోగాలు.. ఇస్రోకు లాభమా?
Kulasekharapatnam: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ – ఇస్రో.. స్పేస్‌లోకి రాకెట్లను పంపించి ప్రయోగాలు నిర్వహిస్తుంది. అయితే ఇటీవల వరుసగా ప్రయోగాలు విజయవంతం చేసి.. ఇస్రో మరింత ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలోనే వారం రోజుల్లో చంద్రుడిపై చంద్రయాన్ 3 ప్రయోగంలోని విక్రమ్ ల్యాండర్ దిగనుంది. మరోవైపు.. సూర్యుడిపైకి రాకెట్‌ను పంపి పరిశోధనలు చేసేందుకు తొలిసారి ఆదిత్య -ఎల్1 ప్రయోగాన్ని వచ్చే నెల మొదట్లో చేపట్టేందుకు సిద్ధమైంది. అయితే ఇస్రో ఇప్పటివరకు చేపట్టిన ప్రయోగాలన్నీ ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి రాకెట్లను నింగిలోకి పంపుతోంది. ఎందుకంటే ఇస్రోకు ఇదొక్కటే ప్రయోగ వేదిక ఉంది. ఇక్కడి నుంచే దేశీయ, విదేశీ ఉపగ్రహాలను విజవంతంగా అంతరిక్షంలోకి పంపిస్తోంది. షార్‌లో రెండు లాంచ్ ప్యాడ్స్ ఉన్నాయి. ఇక్కడి నుంచి పీఎస్‌ఎల్వీ, జీఎస్‌ఎల్వీ అనే రాకెట్ లాంచింగ్ వెహికిల్స్ ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్, విదేశీ ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగిస్తోంది.
Source link