Blog

ISRO: 2020లో ఇస్రో సూపర్ హిట్.. జీశాట్-30 ప్రయోగం సక్సెస్

[ad_1]

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ () 2020లో.. జీశాట్-30 ప్రయోగంతో తొలి హిట్ కొట్టింది. శుక్రవారం తెల్లవారుజామున 2:35 గంటలకు ఫ్రెంచ్ గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రంలో ప్రయోగం జరిగింది. ఏరియన్‌-5 వాహకనౌక ద్వారా జీశాట్‌ 30 ఉపగ్రహాన్ని 38 నిమిషాల్లో నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఇంటర్నెట్‌ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే జీశాట్‌-30 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించారు.

ఈ ఉపగ్రహం బరువు 3357 కిలోలు కాగా.. టెలివిజన్, టెలి కమ్యూనికేషన్‌, బ్రాడ్‌కాస్టింగ్‌ సంబంధించిన మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయి. ఇన్‌శాట్‌- 4ఏ స్థానంలో సేవలందించేందుకు జీశాట్‌-30 ఉపగ్రహాన్ని శాస్త్రవేత్తలు కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. భారత్‌కు చెందిన శక్తిమంతమైన సమాచార ఉపగ్రహం జీశాట్‌-30 ప్రయోగం విజయవంతమైందని ఇస్రో ట్వీట్ చేసింది. జియో స్టేషనరీ ఆర్బిట్ నుంచి సీ, కేయూ బ్యాండ్లలో కమ్యూనికేషన్ సేవలను అందిస్తుంది.

[ad_2]

Source link

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close