Blog
ISRO: చంద్రుడిపై ఇళ్లు, రోడ్లు, విద్యుత్.. నాసా, ఇస్రో కలిసి మరిన్ని ప్రయోగాలు
ISRO: చంద్రుడిపై మొదటిసారి అడుగుపెట్టి 50 ఏళ్లు గడిచింది. అయితే జాబిల్లిపై మానవులు జీవిస్తారా.. అందుకు అనువైన వాతావరణం ఉందా. అక్కడి పరిస్థితులు ఏంటి అనేది పరిశోధించడానికి ఇన్నేళ్లు గడిచినా చెప్పుకోదగ్గ పురోగతి సాధించలేదు. ఇప్పటికీ వ్యోమగాములు చంద్రుడిపైకి వెళ్లి రావడమే గానీ అక్కడ ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటివరకు చంద్రుడిపైకి రష్యా, అమెరికా దేశాలు పలుమార్లు ప్రయోగాలు చేశాయి. అయితే భారత్ మొదటి సారి ప్రయోగించిన చంద్రయాన్ 1 ప్రయోగం చాలా విషయాలు సేకరించింది. అప్పుడే ప్రపంచ దేశాలు అంతరిక్ష రంగంలో భారత్ వైపు చూడటం ప్రారంభించాయి. ఈ క్రమంలోనే ఇస్రో రెట్టించిన ఉత్సాహంతో దూసుకెళ్తోంది. అందులో భాగంగానే అప్రతిహత విజయాలు సాధిస్తోంది. ఈ క్రమంలోనే భారత్, అమెరికాలు కలిసి చంద్రుడిపై పరిశోధనలు నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి.
Source link