NewsTelanganaTelugu News

తెలుగురాష్ట్రాల ఇంటర్ విద్యార్థులకి స్వర్ణ అవకాశం..

  • ఇంటర్‌ ప్రశ్నల్లో 50 శాతం ఛాయిస్‌!
  • కేవలం సగం ప్రశ్నలకే జవాబులు రాయాల్సి ఉంటుంది.
  • మానసిక ఒత్తిడిని తట్టుకునేందుకు తరగతులు
 inter-questions-choice

ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల పత్రాలల్లో ఈసారి‌ 50 శాతానికి ఛాయిస్ పెరగనుంది. ఈ మేరకు ప్రభుత్వ ఆమోదం కోసం ఇంటర్‌బోర్డు అభిప్రాయాలు పంపనుంది. కరోనా పరిస్థితుల్లో విద్యార్థులపై కొంత ఒత్తిడి తాగించాలని భావిస్తున్న బోర్డు అధికారులు ఛాయిస్‌ పెంపుపై ఏ మధ్యలోనే సుదీర్ఘంగా చర్చించారు. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ప్రశ్న పత్రాల్లో, ముఖ్యంగా ఎంపీసీ మరియు బైపీసీ గ్రూపుల్లో ప్రతి దాంట్లో మూడు సెక్షన్లు ఉండగా.. రెండింటిలో 50 శాతం ఛాయిస్‌ ఇవ్వనున్నారు. అంటే వాటిలో సగం ప్రశ్నలకు మాత్రమే జవాబులు రాయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఒకటి లేదా రెండు ప్రశ్నలు మాత్రమే ఛాయిస్‌ కింద అధికంగా ఇచ్చేవారు కానీ ఏ సరి మాత్రం ఏకంగా 50 శతం ఛాయిస్ కింద ఇస్తున్నారు.

గణితంలో ఛాయిస్‌ ఇలా..

సెక్షన్లు – ఇప్పటివరకూ – జరగబోయే పరీక్షల్లో

సెక్షన్‌-ఏ – 10కి 10 రాయాలి – మార్పు లేదు

సెక్షన్‌-బి – 7 ప్రశ్నలకు 5 రాయాలి – ఇప్పుడు 10ప్రశ్నలకు రాయాలి5

సెక్షన్‌-సి – 7ప్రశ్నలకు 5 రాయాలి – ఇప్పుడు 10ప్రశ్నలకు రాయాలి5

(సెక్షన్‌-ఏలో ఒక్కో దానికి 2 మార్కులు, సెక్షన్‌-బిలో 4 మార్కులు, సెక్షన్‌-సిలో 7 మార్కులు)

మానసిక ఒత్తిడిని తట్టుకునేందుకు తరగతులు

  • ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు మానసిక ఒత్తిడిని తట్టుకొనేందుకు స్ట్రెస్‌ మేనేజ్‌మెంట్‌పై ఆన్‌లైన్‌లో అయిదారు తరగతులు నిర్వహించాలని బోర్డు భావిస్తోంది. కెరీర్‌ గిడెలైన్స్ ‌పైనా అవగాహన కల్పించనుంది.
  • ఏ విద్యార్థి ఏ రంగంలో రాణించేందుకు అవకాశం ఉందో దాని గుర్తించి సలహాలు ఇచ్చేందుకు సైకోమెట్రిక్‌ పరీక్ష జరపాలని అధికారులు భావిస్తున్నారు. ఎంపిక చేసిన 10 కళాశాలల్లో ఆన్‌లైన్‌లో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. విద్యార్థులు ఆ ప్రశ్నలకు నిజాయతీగా సమాధానం ఇస్తే ఎవరు ఏ రంగంలో రాణిస్తారో విశ్లేషించి నిపుణులు తగిన సలహాలు ఇస్తారు. గత విద్యా సంవత్సరం మోడల్‌ స్కూళ్లలో పదో తరగతి విద్యార్థులకు సైకోమెట్రిక్‌ పరీక్షలు జరిపారు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close