NewsTelugu News
ఇంటర్ సెకండియర్ పరీక్షలు రద్దు చేసే ఛాన్స్..
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం జరిగిన సమీక్షా సమావేశం తర్వాత సి బి స్ ఈ పరీక్షలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
- కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
- ఇంటర్ సెకండియర్ పరీక్షలు రద్దయ్యే అవకాశం
- ఒకటి రెండు రోజుల్లో స్పష్టత.
దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలను కేంద్రం రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే సీబీఎస్ఈ బాటలోనే తెలంగాణ ఇంటర్ బోర్డు కూడా ఇంటర్ సెకండియర్ పరీక్షల రద్దుకు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేడు లేదా రేపు ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని సమాచారం.
జులై 15 తర్వాత ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ నిర్వహించాలనుకుంటున్నామని కేంద్రానికి ఇటీవల రాష్ట్ర విద్యాశాఖ అభిప్రాయాన్ని తెలిపింది. అయితే గతంలో పది, 11వ తరగతుల పరీక్షలు రద్దు చేస్తున్నట్లు సీబీఎస్ఈ ప్రకటించగానే.. మరుసటి రోజే తెలంగాణ సర్కార్ కూడా టెన్త్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో విద్యకు సంబంధిత విషయాలన్నీ కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే నడుచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖకు గతేడాదే సూచించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రద్దు చేసే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలో సుమారు నాలుగున్నర లక్షల మంది ఇంటర్ సెకండియర్ విద్యార్థులున్నారు.