Latest Govt Jobs

"మాస్టారూ.. మీకివేం కష్టాలు!"… ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఇండియా హెరాల్డ్ ప్రత్యేక కథనం.. !


<![CDATA[బడి అనే నారుమడిలో.. విద్యా అనే విత్తనం వేసి.. అక్షరం అనే నీరు పోసి.. చెడు అనే కలుపుతీసి.. మంచి, నీతి అనే ఫలాన్ని సమాజానికి అందించే ఆదర్శరైతు ఉపాధ్యాయుడు. మనం జీవితంలో ఉన్నతమైన స్థాయికి వెళ్ళినపుడు మన తల్లిదండ్రుల తరువాత అంత గర్వంగా చెప్పుకునే వ్యక్తి మనకి చదువు చెప్పిన గురువే. అందుకే మన సమాజంలో అమ్మా నాన్నల తర్వాతి స్థానం గురువులకు ఇచ్చారు. బతికినంతకాలం నేర్చుకొని ఆ నేర్చుకున్న జ్ఞానాన్ని చనిపోయేంత వరకూ నలుగురికీ పంచే మహోన్నత వ్యక్తి, సమాజాన్ని ప్రభావితం చేసే శక్తి ఉపాధ్యాయుడు. అలాంటి ఉపాధ్యాయులు ఇపుడు ఉద్యోగం కోల్పోయి రోడ్డున పడుతున్నారు, గతిలేక రోడ్డు పక్కన్న చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు. కుటుంబం ఎక్కడ రోడ్డున పడుతుందేమో అని భయపడి కూలీ పనులు చేసుకుంటూ బడి నెట్టేసిన బతుకు బండినీడుస్తున్నారు… నేడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కరోనా ప్రభావం వల్ల ఉపాధ్యాయులు పడుతున్న కష్టాలపై  ఇండియా హెరాల్డ్ స్పెషల్ స్టోరీ…

ఆదియుగం నుంచి ఆధునికయుగం వరకు ఆయనే రుషి.. జీవన వికాసానికి నిచ్చెన వేసే అక్షర కార్మికుడు… సమాజ దేవాలయానికి నిజమైన రక్షకుడు.. ఆయనెవరో కాదు మనందరికీ విద్యా బుద్ధులు నేర్పే గురువు. అందుకే మన సమాజంలో అమ్మానాన్నల తర్వాత స్థానం గురువులకు ఇచ్చారు. మనకి తల్లిదండ్రులు తరువాత  ఈ లోకంలో ఎలా నడుచుకోవాలో నేర్పి, విద్యా బుద్ధులు అందించే ఉపాధ్యాయుడు మూడో గురువు. అందుకే పెద్దలు మాతృదేవో భవ.. పితృదేవో భవ.. ఆచార్య దేవోభవ అని అన్నారు.

ఇంతటి ఉన్నతమైన ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చి, గురువు జాతి గౌరవాన్ని లోకానికి చాటి చెప్పిన మన దేశ రెండో రాష్ట్రపతి, మేధావి, విద్యావేత్త అయిన డాక్టర్‌ సర్వేపల్లి రాధకృష్ణ జయంతిని ప్రభుత్వం ఉపాధ్యాయ దినోత్సవంగా గుర్తించింది. ప్రతి యేటా సెప్టెంబర్‌ 5న గురువులను సన్మానించుకునే అవకాశాన్ని ఇచ్చింది.

తలకిందులు చేసిన కరోనా :

అన్నీ బాగుంటే ఈపాటికి అన్ని స్కూల్స్ లలో హడావిడి గా ఉండేది. ఉపాధ్యాయులు దినోత్సవం నాడు తమకి పాఠాలు చెప్పిన గురువులను చాలా ఘనంగా సమ్నానించుకోవాలని పిల్లలు చేసే హంగామా మాటల్లో చెప్పలేం..! కానీ కరోనా పుణ్యమా అని ఇప్పుడు పరిస్థితులన్నీ తారుమారయ్యాయి. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5 న స్కూల్ మొత్తం పిల్లలు చేసే అల్లర్లతో, కేరింతలతో ఎంతో సందడిగా ఉండేది. ఈరోజు తామే పిల్లలై విద్యార్థులు పాఠాలు చెప్తుంటే చూసి మురిసిపోయేవారు ఉపాధ్యాయులు. అయితే అదంతా గతం, బడుల్లో ఇప్పుడా ఛాయలు ఎక్కడా కనిపించవు. దుమ్ముపట్టిన బల్లలు, తుప్పుపట్టిన తలుపులు, మాసిపోయిన రంగులు, బోసుపోయిన తరగతి గదులు ఇవే ఇప్పుడు మనకి దర్శనమిచ్చేవి. కరోనా వైరస్ ప్రభావం వల్ల దాదాపు నాలుగైదు నెలలుగా పాఠశాలల పరిస్థితి ఇదే…

బతకలేక బడి పంతుళ్ళు..!

 కరోనా వైరస్ వ్యాప్తి తో దాదాపు నాలుగైదు నెలలుగా పాఠశాలలు మూతబడి ఉన్నాయి. దీంతో విద్యార్థులంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇక ఉపాధ్యాయుల పరిస్థితి చెప్పనవరసం లేదు. వారికి కరోనా వల్ల వచ్చిన కష్టాలు అన్ని ఇన్నీ కావు. ప్రభుత్వ పాఠశాలల ఉద్యోగులవి ఒకరకమైన కష్టాలు అయితే ప్రైవేటు స్కూల్ టీచర్ల పరిస్థితి వర్ణనాతీతం. చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు అని చెప్పాల్సిన ఉపాధ్యాయులు మద్యం దుకాణాల వద్ద కాపలా కాశారు. మొన్నామధ్య ఏపీలో మద్యం దుకాణాల వద్ద ప్రభుత్వ టీచర్స్ కు డ్యూటీ లు వేశారు. మద్యం కోసం వచ్చేవాళ్ళని లైన్ లో నించోవాలి అంటూ వారు ప్రాధేయపడ్డారు. అసలు ఇలాంటి పరిస్థితి వస్తుందని వాళ్ళు కలలో కూడా ఊహించి ఉండరు.

 ఇక ప్రైవేటు స్కూల్స్ లలో పని చేసే ఉపద్యాయుల గురించి చెప్పుకొని బాధపడేకంటే ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఎందుకంటే కరోనా వైరస్ వల్ల ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ తో ప్రైవేట్ స్కూల్ లలో పనిచేసే టీచర్స్ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికీ వారు అవే కష్టాలు పడుతున్నారు. అటు ఉద్యోగం లేక ఇటు ఇల్లు గడవక వాళ్ళు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. కూరగాయలు అమ్ముతూ, సిమెంట్ బస్తాలు మోస్తూ, చెప్పులు అమ్ముకుంటూ, కూలీ పనులకు వెళ్తూ ఇలా ఏ పని దొరికితే ఆ పని చేసుకుంటూ బతుకీడుస్తున్నారు ప్రైవేటు టీచర్స్.

 విద్యార్థుల భవితకు బాటలు వేసి, మెరుగైన సమాజాన్ని అందించడానికి ఆ ఉపాధ్యాయులు చేసే కృషికి మనం ఇచ్చే గౌరవం ఇదేనా ? నిరంతరం జ్ఞానం అనే వెలుగు పంచే కొవ్వొత్తుల్లాంటి ఆ ఉపాధ్యాయుల జీవితాన్ని మళ్ళీ వెలిగిద్దాం, ఆ వెలుగుని నలుగురికీ అందిద్దాం, ఇప్పటికైనా ప్రభుత్వాలు ఉపాధ్యాయుల సమస్యలు తెలుసుకొని పరిష్కరించాలని ఆశిద్దాం…..

]]>


Source link

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close