Latest Govt Jobs

ఆంధ్రప్రదేశ్‌లో భారీ ఉద్యోగాలు.. అర్హ‌త ఏంటంటే..?


<![CDATA[

ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ కోర‌ల్లో చిక్కుకుని ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌లు తీవ్ర స్థాయిలో వ‌ణికిపోతున్న సంగ‌తి తెలిసిందే. చైనాలో పుట్టుకొచ్చిన ఈ ప్రాణాంత‌క మ‌హ‌మ్మారి నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు దేశ‌దేశాలు తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. అయిన‌ప్ప‌టికీ ఫ‌లితం ద‌క్క‌డం లేదు. వ్యాక్సిన్ వ‌స్తేగానీ అంతం కాని క‌రోనా.. ఇప్ప‌టికే ల‌క్ష‌ల ప్రాణాల‌ను బ‌లితీసుకుంది. ఇక కొన్ని లక్షల మందికి పైగా ఈ వ్యాధి సోకింది. మ‌రోవైపు కంటికి కనిపించని కరోనా దెబ్బకు అన్నిరంగాలు విలవిలలాడిపోతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతోంది.

ఈ క్ర‌మంలోనే ల‌క్ష‌లాది మంది ఉపాధి కోల్పోతున్నారు. అయితే ఇలాంటి విప‌త్క‌ర స‌మ‌యంలో ఆంధ్రప్రదేశ్ డైరక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్‌ఫేర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిషికేష‌న్‌లో 665 ఖాళీలు ఉన్నాయి. సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. విద్యార్థ‌త ఏంటంటే..  ఎంబీబీఎస్ పాసైనవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. అలాగే అభ్యర్థులు ఏపీఎంసీలో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి.

IHG

ఇక ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 2020 జూలై 1 నాటికి 42 ఏళ్ల లోపు ఉండాలి. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది. ఇక ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు కమిషనరేట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మిషన్ అధికారిక వెబ్‌సైట్‌ http://cfw.ap.nic.in/ లో తెలుసుకోవచ్చు. కాగా, ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ఇప్ప‌టికే ప్రారంభ‌మైంది. దరఖాస్తు చేయడానికి ఆఖ‌రి తేదీ 2020 జూలై 18. కాబ‌ట్టి, ఆస‌క్తిగ‌ల అభ్య‌ర్థులు నోటిఫికేష‌న్ పూర్తి వివ‌రాల‌ను తెలుసుకుని.. వెంట‌నే ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌లెను.

]]>


Source link

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close