NewsTelanganaTelugu News
ఎంసెట్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. అధికారుల కీలక ప్రకటన.
తాజా వార్తల ప్రకారం.. అభ్యర్థులు జూన్ 3 వరకు ఎలాంటి ఆలస్యం లేకుండానే ఎంసెట్ పరీక్షకు అప్లయ్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలు eamcet.tsche.ac.in వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
- టీఎస్ ఎంసెట్ దరఖాస్తు గడువు పెంపు’
- జూన్ 3 దరఖాస్తు చేసుకునే ఛాన్స్
- వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు
తెలంగాణ ఎంసెట్ 2021 పరీక్ష విషయంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ అమలులో ఉండడంతో ఇటీవల దరఖాస్తు గడువును మే 18 నుంచి 26 వరకు అధికారులు పొడిగించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా దరఖాస్తు గడువును మరో సారి పొడిగించారు. జూన్ 3 వరకు ఎంసెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. కరోనా సమయంలో అభ్యర్థులెవరూ నష్టపోకుండా ఉండేందుకు ఎంసెట్ దరఖాస్తుల విషయంలో అధికారులు ఇలాంటి కీలక నిర్ణయం తీసుకున్నారు.
తాజా ప్రకటన ప్రకారం.. అభ్యర్థులు జూన్ 3 వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండానే ఎంసెట్ పరీక్షకు అప్లయ్ చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో ఎంసెట్ పరీక్షకు మే 26వ తేదీ నాటికి 2,01,367 మంది అభ్యర్థులు అప్లయ్ చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో ఇంజనీరింగ్ విభాగంలో 1, 35,151 మంది అగ్రికల్చర్ విభాగంలో 66,216 మంది అప్లయ్ చేసుకున్నట్లు తెలిపారు.
ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు https://eamcet.tsche.ac.in/ వెబ్‌సైట్ ద్వారా ఎంసెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు.