Telugu News
మార్చి 30 నాటికీ ఏపీ, తెలంగాణ టు వరల్డ్‌వైడ్ కరోనా బాధితుల నెంబర్లు ఇవే..
ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఆదివారం మరింత విజృంభించింది. స్పెయిన్, ఇటలీ, అమెరికా లాంటి దేశాల్లో పరిస్థితి హెచ్చుమీరింది. ఇక సోమవారం ఉదయం 7 గంటల వరకు ఉన్న కేసులు పరిశీలిస్తే ప్రపంచ వ్యాప్తంగా 7, 21, 562 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక 33, 965 మంది మృతిచెందారు. ఇక రివకరీ అయిన కేసులు 1, 51, 128 ఉన్నాయి. ఇక యాక్టివ్ కేసులు 5, 36, 469 ఉన్నాయి. ఇక క్లోజ్‌డ్ కేసులు 1,85, 093 ఉన్నాయి.
ఇక ఇండియాలో కేసుల సంఖ్య 1024కు చేరుకుంది. ఇక్కడ కొత్త కేసులు 37 గా ఉన్నాయి. కరోనా మృతుల సంఖ్య మనదేశంలో 27కు చేరుకుంది. ఇక మనదేశంలో కేరళ, మహారాష్ట్రలో కరోనా కేసులు చాలా ఎక్కువుగా నమోదు అవుతున్నాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఏపీలో ఆదివారం మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ రెండూ విశాఖలోనే నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 21కి చేరింది. విశాఖలో కేసుల సంఖ్య 6కి పెరిగింది. తాజాగా నమోదైన రెండు కేసులూ ఇతర దేశం నుంచి వచ్చిన వారినుంచి సోకినవేనని నిర్ధారించారు.
ఏపీలో కూడా కరోనాను కట్టడి చేసేందుకు క్వారంటైన్‌లో ఉన్న వారి సంఖ్య ఏకంగా 30 వేలకు చేరుకుంది. ఇక తెలంగాణ వాషయానికి వస్తే తెలంగాణలో ఆదివారం ఒక్క పాజిటివ్ కేసు నమోదు అయ్యింది. దీంతో ఇప్పుడు తెలంగాణలో కరోనా పాజిటివ్ బాధితుల సంఖ్య 70కు చేరుకుంది. ఇక్కడ కూడా క్వారంటైన్‌లో ఉన్న వారు ఏకంగా 30 వేల మంది ఉన్నారు.
- China Astronauts: చంద్రుడికిపై 2030లోగా చైనా వ్యోమగాములు.. డ్రాగన్ కీలక ప్రకటన
- GSLV-F12 : విజయవంతంగా నింగిలోకి భారత రెండో తరం నావిగేషన్ శాటిలైట్
- The Cost of Car Insurance in the USA: A Comprehensive Guide
- The Best Car Accident Lawyers in California: Your Trusted Advocates
- Do You Need to Hire a Car Accident Lawyer
కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.
Source : AP Herald