Telugu News

క‌రోనా పై యుద్ధం: తెలంగాణను మించిన ఏపీ లెక్క‌లు…

క‌రోనా మ‌హ‌మ్మారి రెండు తెలుగు రాష్ట్రాల్లో జోరుగా విజృంబిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలు క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెంద‌కుండా ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాయి. ప‌రిస్థితి చేయి దాట‌కుండా చివ‌ర‌కు ఏప్రిల్ 14వ తేదీ వ‌ర‌కు లాక్ డౌన్ కూడా ప్ర‌క‌టించాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ అయితే ఒక అడుగు ముందుకు వేసీ ఏకంగా ఏప్రిల్ 15వ తేదీ వ‌ర‌కు కూడా లాక్ డౌన్ ప్ర‌క‌టించారు. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు తెలంగాణ‌లోనే క‌రోనా విజృంభిస్తోంద‌ని అంద‌రూ అనుకుంటున్నారు.

అయితే ఇప్పుడు ఏపీలో లెక్క‌లు సైతం అంద‌రికి షాక్ ఇస్తున్నాయి. ఏపీ వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఆళ్ల నాని చెప్పిన లెక్క‌లు షాక్ ఇచ్చేలా ఉన్నాయి. తెలంగాణ‌ను మించేలా ఏపీలో ఇప్ప‌టి వ‌ర‌కు 29, 464 మంది విదేశాల నుంచి వ‌చ్చారు. వీరిలో చాలా మందిని ప్ర‌భుత్వం త‌ర‌పున‌ క్వారంటైన్ చేశారు అధికారులు… క‌రోనా విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వం ఎప్ప‌టిక‌ప్పుడు చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటుంద‌ని కూడా మంత్రి ప్ర‌క‌టించారు.


ఇక ప్ర‌తి క్వారంటైన్ కేంద్రంలో ఓ ప్ర‌త్యేక అధికారిని నియ‌మించేలా చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్టు సీఎం జ‌గ‌న్ చెప్పార‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు. ఇత‌ర రాష్ట్రాల్లో ఉన్న ఆంధ్రుల యోగ క్షేమాలు తెలుసుకునేందుకు సైతం ఏపీ ప్ర‌భుత్వం త‌ర‌పున అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని మంత్రి తెలిపారు. కేవ‌లం ఇత‌ర రాష్ట్రాల్లో ఆంధ్రుల కోస‌మే ఓ ఐఏఎస్ అధికారిని నియ‌మించామ‌న్నారు. ఈ వైర‌స్ రూర‌ల్ ప్రాంతాల్లో క‌న్నా ఎక్కువుగా అర్బ‌న్ ప్రాంతాల్లోనే వైరల్ అవుతోంద‌న్నారు.



క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :



NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Source :  AP Herald

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close