MoviesTelugu song Lyrics

Chukkala Chunni Song Lyrics in telugu | హే చుక్కల చున్నీకే… |

Chukkala Chunni Song Lyrics in telugu: ఐ హేట్ మై లైఫు… అనే పాట “కల్యాణమండపం” సినిమాలోని పాట, దీనిని అనురాగ్ కులకర్ణి పాడారు, ఈ పాటకి రచయిత భాస్కర భట్ల ఈ పాటకి సంగీతాన్ని ఇచ్చింది చైతన్ భరద్వాజ్.

chukala-chinni-song-lyrics-in-telugu

HChukkala Chunni Song Lyrics in telugu:

గానం: అనురాగ్ కులకర్ణి
రచయిత: భాస్కర భట్ల
సంగీతం: చైతన్ భరద్వాజ్.

హే చుక్కల చున్నీకే
నా గుండెను కట్టావే
ఆ నీలాకాశంలో
గిర్రా గిర్రా తిప్పేసావే
మువ్వల పట్టీకే
నా ప్రాణం చుట్టావే
నువ్వెళ్ళే దారంతా… అరె
గళ్ళు గళ్ళు మోగించావే
వెచ్చా వెచ్చా ఊపిరితోటి…
ఉక్కిరి బిక్కిరి చేశావే
ఉండిపో ఉండిపో
ఉండిపో నాతోనే

హొయ్యారే హొయ్యారే
హొయ్యా హొయ్యా
నీ వల్లే నీ వల్లే
పిచ్చోడిలా తయారయ్యా
హొయ్యారే హొయ్యారే
హొయ్యా హొయ్యా
నీ వల్లే నీ వల్లే
నాలో నేనే గల్లంతయ్యా

కొత్త కొత్త చిత్రాలన్నీ
ఇప్పుడే చూస్తున్నాను
గుట్టుగా దాచుకోలేను
డప్పే కొట్టి చెప్పాలేను
పట్టలేని ఆనందాన్ని ఒక్కడినే మొయ్యలేను
కొద్దిగా సాయం వస్తే
పంచుకుందాం నువ్వు నేను
కాసేపు నువ్వు కన్నార్పకు
నిన్నులో నన్ను చూస్తూనే ఉంటా
కాసేపు నువ్వు మాటాడకు
కౌగిళ్ళ కావ్యం రాసుకుంటా

ఓ ఎడారిలా ఉండే నాలో
సింధూ నదై పొంగావే
ఉండిపో ఉండిపో
ఉండిపో నాతోనే

హొయ్యారే హొయ్యారే
హొయ్యా హొయ్యా
నీ వల్లే నీ వల్లే
పిచ్చోడిలా తయారయ్యా
హొయ్యారే హొయ్యారే
హొయ్యా హొయ్యా
నీ వల్లే నీ వల్లే
నాలో నేనే గల్లంతయ్యా

బాధనే భరించడం
అందులోంచి బయటికి రాడం
చాలా చాలా కష్టం అని
ఏంటో అంతా అంటుంటారు
వాళ్లకి తెలుసో లేదో
హాయిని భరించడం
అంతకన్న కష్టం కదా
అందుకు నేనే సాక్ష్యం కదా
ఇంతలా నేను నవ్వింది లేదు
ఇంతలా నన్ను పారేసుకోలేదు
ఇంతలా నీ జుంకాలాగా
మనసేనాడు ఊగలేదు

హే దాయి దాయి అంటూ ఉంటే
చందమామై వచ్చావే
ఉండిపో ఉండిపో
ఉండిపో తోడుగా నాతోనే

హొయ్యారే హొయ్యారే
హొయ్యా హొయ్యా
నీ వల్లే నీ వల్లే
పిచ్చోడిలా తయారయ్యా
హొయ్యారే హొయ్యారే
హొయ్యా హొయ్యా
నీ వల్లే నీ వల్లే
నాలో నేనే గల్లంతయ్యా

Chukkala Chunni video Song in telugu:

మర్రిన్ని పాటలకోసం క్లిక్ చేయండి

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close