Blog
Chandrayaan-3: వచ్చే వారం తెరుచుకోనున్న చంద్రయాన్-3 నాలుగో కన్ను
Chandrayaan-3: చంద్రుడి ఉపరితలంపై ఒక రోజు అంటే భూమిపై 29 రోజులతో సమానం. అంటే జాబిల్లి ఉపరితలంపై 14 రోజులు పగలు, 14 రోజులు రాత్రి ఉంటుంది. ఈ లెక్కన ఆగస్టు 23న చంద్రుడిపై సూర్యోదయం మొదలుకావడంతో చంద్రయాన్-3 మిషన్‌లోని విక్రమ్ ల్యాండర్‌ను ఇస్రో సురక్షితంగా దింపింది. ఇప్పటికే 10 రోజులు పూర్తికావడంతో మరో నాలుగు రోజుల్లో అక్కడ రాత్రి సమయం ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో రాత్రిపూట చంద్రయాన్-3 మిషన్ పనిచేస్తుందా? అనేది తెలియాల్సి ఉంది.
Source link