Blog
Chandrayaan 3: మరికొన్ని గంటల్లో జాబిల్లి మీదికి.. చంద్రయాన్ 3 కౌంట్‌డౌన్
Chandrayaan 3: చంద్రుడిపై అన్వేషణ కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ – ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న చంద్రయాన్ – 3 నింగిలోకి దూసుకెళ్లేందుకు సమయం ఆసన్నమైంది. ఈ ప్రయోగం కోసం ఇస్రో అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఈ చంద్రయాన్ – 3 ప్రయోగానికి సంబంధించి గురువారం కౌంట్‌డౌన్‌ను ఇస్రో ప్రారంభించింది. గురువారం మధ్యాహ్నం.. ఒంటి గంట 5 నిమిషాలకు కౌంట్‌డౌన్ ప్రారంభం కాగా.. అది దాదాపు 25 గంటలపాటు కొనసాగనుంది. అనంతరం శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల 35 నిమిషాలకు ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా శ్రీహరికోటలో ఉన్న సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ – షార్ నుంచి నిప్పులు కక్కుకుంటూ నింగిలోకి దూసుకెళ్లనుంది. షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి లాంచ్ వెహికల్ మార్క్ – ఎల్‌వీఎం3 – ఎం4 రాకెట్ నింగిలోకి ప్రయాణించనుంది. ఈ చంద్రయాన్ – 3 ప్రయోగానికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు, సౌకర్యాలను ఇస్రో శాస్త్రవేత్తలు పూర్తి చేశారు. ఇక మరి కొన్ని గంటల్లోనే చంద్రయాన్ – 3 జాబిల్లి వైపు ప్రయాణించనుంది.
Source link