Blog
Chandrayaan 3: చంద్రయాన్ 3 తర్వాత ఇస్రో లక్ష్యం ఏంటి.. జాబిల్లిపై మనుషుల్ని దించుతుందా ?
Chandrayaan 3: చంద్రుడిపై మరిన్ని పరిశోధనలు చేయడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ – ఇస్రో.. చంద్రయాన్ 3 ను విజయవంతంగా ప్రయోగించింది. గతంలో ప్రయోగించిన చంద్రయాన్ -1 లో ఆర్బిటర్, మూన్ ఇంపాక్ట్ ప్రోబ్‌ను జాబిల్లి వద్దకు పంపించారు. ఇక చంద్రయాన్ – 2 లో ఆర్బిటర్‌తోపాటు ల్యాండర్, రోవర్‌ను కూడా చంద్రుడిపైకి ప్రయోగించారు. అయితే చంద్రయాన్ – 2 ప్రయోగం చివరి నిమిషంలో విఫలం కావడంతో ల్యాండర్ సేఫ్ ల్యాండింగ్ కాకుండా క్రాష్ ల్యాండింగ్ అయింది. దీంతో ల్యాండర్ నుంచి రోవర్ బయటికి రాలేదు. ఇటు ఇస్రోకు కూడా ల్యాండర్, రోవర్ నుంచి ఎలాంటి సమాచారం అందకుండా కమ్యూనికేషన్ వ్యవస్థ కట్ అయిపోయింది. అయితే ప్రస్తుతం ప్రయోగించిన చంద్రయాన్ – 3 లో ఆర్పిటర్‌ను పంపించలేదు.
Source link