NewsTelugu News

సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు రద్దు..

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం జరిగిన సమీక్షా సమావేశం తర్వాత పరీక్షలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం​ ప్రకటించింది.

  • కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
  • సీబీఎస్‌ 12వ తరగతి పరీక్షలు రద్దు
  • విద్యార్థుల ఆరోగ్యమే ముఖ్యమన్న ప్రధాని.
cbse-bord-exams-cancelled

ఎట్టకేలకు ఉత్కంఠకు తెరపడింది. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలను రద్దు చేయక తప్పనిసరి పరిస్థితి నెలకొంది. ఈ పరీక్షల నిర్వహణపై పలుమార్లు చర్చలు జరిపిన కేంద్రం ఎట్టకేలకు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం జరిగిన సమీక్షా సమావేశం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం ప్రకటించింది.

విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒత్తిడితో కూడిన ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులను పరీక్ష రాసేందుకు బలవంతం చేయకూడదని ప్రధాని సూచించారు.

పరీక్షలు రాయాలనుకునే వారికి కరోనా ఉద్ధృతి తగ్గాక పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. గతేడాది మాదిరిగానే ఆసక్తి ఉన్నవారికి పరీక్షలు నిర్వహించనున్నారు. సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలను కూడా గతంలో రద్దు చేసిన విషయం తెలిసిందే. అలాగే, ఫలితాల వెల్లడి విషయంలో అబ్జెక్టివ్ విధానాన్ని అవలంభించాలని నిర్ణయించారు. నిర్ణీత సమయంలో ఫలితాలను ప్రకటించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close