Telugu song Lyrics

Buttabomma Song Lyrics in Telugu | ‘బుట్టబొమ్మ’ సాంగ్ లిరిక్స్

Buttabomma Song Lyrics in Telugu: తెలుగులో చాలా పాటలు రాసిన రాంజీ తాజాగా ‘అల వైకుంఠపురములో’ సినిమాలో ‘బుట్టబొమ్మ’ అనే పాటను రాశారు. చాలా సరళమైన, అర్థవంతమైన పదాలతో రాంజీ ఈ పాటను చాల బాగా రాశారు. అంతే అందంగా తమన్ ఈ పాటను స్వరపరిచారు. యువ గాయకుడు అర్మాన్ మాలిక్ అద్భుతంగా ఆలపించారు. ఇంత అందమైన పాటను మీ స్వరంతో ఆలపించండి.

Buttabomma-Song-Lyrics-in-Telugu

Buttabomma Song Lyrics in Telugu

ఇంతకన్న మంచి పోలికేది నాకు తట్టలేదు గానీ అమ్ము..
ఈ లవ్వనేది బబులు గమ్ము.. అంటుకున్నాదంటే పోదు నమ్ము..

ముందు నుంచి అందరన్నమాటే గానీ మళ్లీ అంటున్నానే అమ్ము..
ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము.. ప్రేమనాపలేవు నన్ను నమ్ము..
ఎట్టాగా అనే ఎదురు చూపుకి తగినట్టుగా నువ్వు బదులు చెబితివే..
ఓరి దేవుడా ఇదేందనేంత లోపటే పిల్లడా అంట దగ్గరై నన్ను చేరదీస్తివే..
బుట్టబొమ్మా బుట్టబొమ్మా నన్ను సుట్టుకుంటివే.. జిందగీకే అట్టబొమ్మై జంట కట్టుకుంటివే “2”

మల్టీప్లెక్సులోని ఆడియన్సులాగా మౌనంగున్నాగానీ అమ్ము
లోన దందనక జరిగిందే నమ్ము.. దిమ్మ తిరిగినాదే మైండు సిమ్ము..
రాజుల కాలం కాదు.. రథము గుర్రం లేవు..
అద్దం ముందర నాతో నేనే యుద్ధం చేస్తాంటే..
గాజుల చేతులు జాపి దగ్గరకొచ్చిన నువ్వు..
చెంపల్లో చిటికేసి చక్కరవర్తిని చేసావే..

చిన్నగా సినుకు తుంపరడిగితే
కుండపోతగా తుఫాను తెస్తివే
మాటగా ఓ మల్లెపూవునడిగితే
మూటగా పూలతోటగా పైనొచ్చి పడితివే
బుట్టబొమ్మా బుట్టబొమ్మా నన్ను సుట్టుకుంటివే..
జిందగీకే అట్టబొమ్మై జంట కట్టుకుంటివే
వేలి నిండా నన్ను తీసి బొట్టు పెట్టూకుంటివే
కాలికింది పువ్వు నేను నెత్తినెట్టూకుంటివే

ఇంతకన్న మంచి పోలికేది నాకు తట్టలేదు గానీ అమ్ము..
ఈ లవ్వనేది బబులు గమ్ము.. అంటుకున్నాదంటే పోదు నమ్ము..
ముందు నుంచి అందరన్నమాటే గానీ మళ్లీ అంటున్నానే అమ్ము..
ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము.. ప్రేమనాపలేవు నన్ను నమ్ము..

Buttabomma Song Lyrics in Telugu Video:

Also Read:

Tags

Related Articles

One Comment

  1. Pingback: Manasa Manasa Song Lyrics | ‘మనసా మనసా’ సాంగ్ లిరిక్స్ | బ్యాచ్‌లర్స్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close