General Knowledge

Telugu General Knowledge | తెలుగు జనరల్ కనౌలెడ్జి | 02/12/2019

1. కింది వాటిలో భూకంపాలు సంభవించడానికి కారణం ఏది?
  1) అణు ప్రయోగాలు
  2) అగ్ని పర్వతాలు
  3) భూ అంతర్భాగంలో సంభవించే రసాయనిక మార్పులు
  4) పైవన్నీ

2. కింది వాటిలో భూకంప తరంగాలు ఏవి?
  1) భూతల తరంగాలు 
  2) ద్వితీయ తరంగాలు
  3) ప్రాథమిక తరంగాలు
  4) పైవన్నీ

3.ప్రాథమిక తరంగాలకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
  1) వీటిని తోసే తరంగాలు అంటారు 
  2) ఇవి ద్రవ, ఘన పదార్థాల్లో మాత్రమే ప్రయాణిస్తాయి
  3) ఇవి అధిక పౌన:పున్యం కలిగి ఉంటాయి
  4) పైవన్నీ సరైనవే

4. కింది వాటిలో లోతు ఆధారంగా సంభవించే భూకంపాలు ఏవి?
  1) అగాధ భూకంపాలు 
  2) మాధ్యమిక భూకంపాలు
  3) గాధ భూకంపాలు
  4) పైవన్నీ

5. ద్వితీయ తరంగాలకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
 1) ఈ తరంగాల వేగం సెకనుకు 3.2 కి.మీ. నుంచి 7.2 కి.మీ. ఉంటుంది
 2) ఇవి ఘన పదార్థాల్లో మాత్రమే ప్రయాణిస్తాయి
 3) వీటిని కదిలించే తరంగాలు అంటారు 
 4) పైవన్నీ సరైనవే

6. ‘ఛాయా మండలం’ అంటే?
 ఎ) P తరంగాలు ప్రయాణించని కేంద్ర మండల ప్రాంతం
 బి) S తరంగాలు ప్రయాణించని కేంద్ర మండల ప్రాంతం
  1) ఎ మాత్రమే 
  2) బి మాత్రమే
  3) ఎ, బి రెండూ కావు
  4) ఎ, బి రెండూ సరైనవే

7. భూకంపాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
  1) సిస్మాలజీ 
  2) కాస్మాలజీ
  3) ఓసాలజీ 
  4) జియో మార్పాలజీ

8. మనదేశంలో తొలి భూకంప నమోదు కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు?
  1) న్యూఢిల్లీ  
  2) కోల్‌కతా
  3) హైదరాబాద్ 
  4) ముంబై

9. భూకంప తీవ్రతను కొలవడానికి ఉపయోగించే స్కేలు ఏది?
  1) రిక్టర్ స్కేల్ 
  2) మెర్కలీ స్కేల్
  3) రైన్ గేజ్ 
  4) 1, 2

10. కింది వాటిలో ఏ ప్రాంతంలో భూకంపాలు ఎక్కువగా సంభవిస్తాయి?
  1) అట్లాంటిక్ మహా సముద్రం 
  2) పసిఫిక్ మహా సముద్రం
  3) హిందూ మహా సముద్రం 
  4) అరేబియన్ సముద్రం

11. రిక్టర్ స్కేల్‌పై కొలవగలిగే భూకంప తీవ్రత ఎంత?
  1) 0 – 9   
  2) 2 – 4
  3) 3 – 16 
  4) 0 – 5

12. అల్లాబండ్ సరస్సు ఏ విధంగా ఏర్పడింది?
  1) భూకంపాల వల్ల 
  2) అగ్ని పర్వతాల వల్ల
  3) నదీ ప్రవాహం వల్ల 
  4) మానవ ప్రమేయం వల్ల

13. అల్లాబండ్ సరస్సు ఏ విధంగా ఏర్పడింది?
  1) భూకంపాల వల్ల 
  2) అగ్ని పర్వతాల వల్ల
  3) నదీ ప్రవాహం వల్ల 
  4) మానవ ప్రమేయం వల్ల

14.‘సైక్లోన్’ అనే పదం ఏ భాష నుంచి ఉద్భవించింది?
  1) ఫ్రెంచ్  
  2) గ్రీకు
  3) అరబ్  
  4) డచ్

15. ‘సైక్లోన్’ అనే పదాన్ని తొలిసారి ఉపయోగించిన వారెవరు?
  1) హెన్రీ పెడింగ్టన్  
  2) రాబర్‌‌ట   
  3) సి.వి. రామన్ 
  4) లూథర్ గల్నల్

16. ఆంధ్ర ప్రదేశ్‌లో లైలా తుఫాన్ ఎప్పుడు సంభవించింది?
  1) 2009  
  2) 2010
  3) 2014  
  4) 2012

17. ఆంధ్ర ప్రదేశ్‌లో హుద్‌హుద్ తుఫాన్ ఎప్పుడు సంభవించింది?
  1) 2014  
  2) 2013
  3) 2015  
  4) 2016

18. హుద్‌హుద్ తుఫాను వల్ల ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర ప్రభావానికి గురైన జిల్లా ఏది?
  1) విజయనగరం 
  2) శ్రీకాకుళం
  3) విశాఖపట్టణం 
  4) పైవన్నీ

19. హుద్‌హుద్ అంటే?
  1) ఇజ్రాయెల్ జాతీయ పక్షి
  2) అఫ్గానిస్తాన్ జాతీయ జంతువు
  3) బంగ్లాదేశ్‌లోని ఒక గ్రామం
  4) శ్రీలంకలో నివసించే ఒక తెగ

20. ఏ ప్రాంతంలో సంభవించే తుఫానులను ‘హరికేన్’లు అని పిలుస్తారు?
  1) ఇటలీ  
  2) కరేబియన్ దీవులు
  3) ఇండోనేషియా 
  4) జపాన్

21. ఏ ప్రాంతంలో సంభవించే తుఫానులను ‘హరికేన్’లు అని పిలుస్తారు?
  1) ఇటలీ  
  2) కరేబియన్ దీవులు
  3) ఇండోనేషియా 
  4) జపాన్

22. ఆస్ట్రేలియాలో తుఫానులను ఏమని పిలుస్తారు?
  1) టోర్నడోలు 
  2) విల్లీవిల్లీలు
  3) నర్గీస్‌లు 
  4) టైపూన్‌లు

23. ఇటీవల సంభవించిన ‘తిత్లీ తుఫాన్’ వల్ల తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రం ఏది?
  1) ఆంధ్రప్రదేశ్ 
  2) ఒడిషా
  3) చత్తీస్‌గఢ్ 
  4) 1, 2

24. ఆంధ్రపదేశ్‌లో తిత్లీ తుఫాను ప్రభావానికి గురైన జిల్లా ఏది?
  1) శ్రీకాకుళం 
  2) విజయనగరం
  3) కృష్ణా  
  4) 1, 2

25. ఒడిశాలో తిత్లీ వల్ల తీవ్రంగా నష్టపోయిన జిల్లాలు ఎన్ని?
  1) 16  
  2) 12
  3) 10  
  4) 6

26. కింది వాటిలో వరదలు సంభవించడానికి ప్రధాన కారణం ఏది?
  1) కాలువలను తగిన సామర్థ్యంతో నిర్మించకపోవడం
  2) భారీ వర్షాలు కురవడం
  3) సరైన మురుగు నీటి వ్యవస్థ లేకపోవడం
  4) పైవన్నీ

27. వరదల రకాలకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
  1) ఆకస్మిక వరదలు 
  2) పట్టణ వరదలు
  3) నదీ వరదలు 
  4) పైవన్నీ సరైనవే

28. వరద విపత్తు నిర్వహణను ఏ మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తుంది?
  1) హోం శాఖ 
  2) రెవెన్యూ శాఖ
  3) విత్త శాఖ
  4) రైల్వే శాఖ

29.కింది వాటిలో ఏ రాష్ట్రంలో అత్యధికంగా వరదలు సంభవిస్తున్నాయి?
  1) ఉత్తర ప్రదేశ్ 
  2) ఒడిశా
  3) అసోం  
  4) పైవన్నీ

30. మనదేశంలో ఎంత శాతం భూమి వరదలకు గురవుతోంది?
  1) 12%  
  2) 19%
  3) 40%  
  4) 42%

31. జాతీయ విపత్తు తగ్గింపు దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు?
  1) నవంబర్ 26  
  2) అక్టోబర్ 29
  3) డిసెంబర్ 21  
  4) జూలై 6

32. జాతీయ వరద నిర్వహణ కార్యక్రమాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
  1) 1950  
  2) 1954 
  3) 1959  
  4) 1964

33. కింది వాటిలో వరదల వల్ల కలిగే లాభం ఏది?
  1) భూగర్భ జలాల నీటి మట్టం పెరుగుతుంది 
  2) పంటల వృద్ధి పెరిగి అధిక దిగుబడి వస్తుంది
  3) వరదలు సంభవించిన ప్రాంతాల్లో నేలలు సారవంతమవుతాయి
  4) పైవన్నీ

34. సునామీ అనే పదం ఏ భాషకు చెందింది?
  1) ఫ్రెంచ్  
  2) జపనీస్
  3) పోర్చుగీసు 
  4) రష్యన్

35.భారత భూభాగంలో ఎంత శాతం భూకంపాలు సంభవిస్తున్నాయి?
  1) 10%  
  2) 59%
  3) 40%  
  4) 42%

36. విపత్తు నిర్వహణ చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు?
  1) 2004  
  2) 2005
  3) 2008  
  4) 2012

37. మనదేశంలో తక్కువ భూకంప తీవ్రత కలిగిన ప్రాంతం ఏది?
  1) దక్షిణ భారత్ 
  2) ఈశాన్య భారత్
  3) గంగా మైదాన్ 
  4) ఏదీకాదు

38. నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ ఎక్కడ ఉంది?
  1) బెంగళూర్ 
  2) హైదరాబాద్
  3) ముంబై 
  4) కోల్‌కతా

39. కింది వాటిలో సునామీ సంభవించడానికి కారణం ఏది?
  1) సముద్ర అంతర్భాగంలో సంభవించే అగ్ని పర్వత విస్ఫోటనం
  2) సముద్రంలో ఏర్పడే భూకంపం
  3) సముద్రం బయట ఏర్పడి, నీటిలోకి చేరే భూపాతం
  4) పైవన్నీ

40.అంతర్జాతీయ సునామీ హెచ్చరిక కేంద్రం ఎక్కడ ఉంది?
  1) హోనలూలు 
  2) కాలిఫోర్నియా
  3) న్యూజెర్సీ 
  4) టోక్యో

41. జాతీయ సునామీ ముందస్తు హెచ్చరిక  కేంద్రం ఏ నగరంలో ఉంది?
  1) బెంగళూరు 
  2) హైదరాబాద్
  3) గోవా  
  4) కోల్‌కతా

42. భూకంప తీవ్రత దృష్ట్యా భారత్‌ను ఎన్ని జోన్లుగా విభజించారు?
  1) 1-10 జోన్లు 
  2) 2 – 5 జోన్లు
  3) 1 – 15 జోన్లు 
  4) 1 – 20 జోన్లు

43. BI ను విస్తరించండి.
  1) Bureau of Indian Sciences
  2) Bureau of Indian Standards
  3) Bureau of Indian Services
  4) ఏదీకాదు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close