Current Affairs

Telugu Current Affairs | తెలుగులో కరెంటు అఫైర్స్ నవంబర్ 17/12/2019

25వ ప్రపంచ పర్యావరణ సదస్సు ముగింపు

దాదాపు 200 దేశాల నుంచి హాజరైన ప్రతినిధులతో స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో అట్టహాసంగా ప్రారంభమైన 25వ ప్రపంచ పర్యావరణ సదస్సు (కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్-కాప్ 25) ఎలాంటి ఫలితం తేలకుండానే ముగిసింది.

Current Affairs

డిసెంబర్ 2నుంచి 13 వరకూ జరగాల్సిన సమావేశాల్లో ఫలితం తేలకపోవడంతో డిసెంబర్ 15 వరకూ పొడిగించారు. అయినప్పటికీ కర్బన ఉద్గారాల తగ్గింపుపై 2015 పారిస్ ఒప్పందం చేసిన సూచనలను అమలు చేసే దిశగా అడుగులు పడలేదు. 2020 ఏడాది స్కాట్లాండ్ (గ్లాస్గో)లో జరగనున్న సీఓపీ26 సదస్సులో వాటిని చర్చించాలని నిర్ణయించారు. సదస్సులో పలు అంశాలు చర్చకు వచ్చినప్పటికీ ఎటువంటి అంగీకారం కుదరలేదు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
 25వ ప్రపంచ పర్యావరణ సదస్సు ముగింపు
ఎప్పుడు : డిసెంబర్ 15
ఎక్కడ : మాడ్రిడ్, స్పెయిన్

తస్నిమ్‌కు ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ టైటిల్

భారత అమ్మాయి తస్నిమ్ మీర్‌కు ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ టైటిల్ లభించింది.

Current Affairs

అండర్-15 బాలికల సింగిల్స్ విభాగంలో తస్నిమ్ మీర్ విజేతగా అవతరించింది. ఇండోనేసియాలోని సురబాయలో డిసెంబర్ 15న జరిగిన ఫైనల్లో తస్నిమ్ మీర్ 17-21, 21-11, 21-19తో భారత్‌కే చెందిన తారా షాపై విజయం సాధించింది. గుజరాత్‌కు చెందిన 13 ఏళ్ల తస్నిమ్ 2019 ఏడాది జనవరిలో ఖేలో ఇండియా గేమ్స్‌లో అండర్-17 సింగిల్స్ విభాగంలో స్వర్ణం నెగ్గింది. అలాగే 2018 ఏడాది ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి మేఘన రెడ్డితో కలిసి అండర్-15 డబుల్స్ విభాగంలో టైటిల్ సాధించింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
 ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ టైటిల్
ఎప్పుడు : డిసెంబర్ 15
ఎవరు : తస్నిమ్ మీర్
ఎక్కడ : సురబాయ, ఇండోనేసియా

అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఒప్పందం

అమెరికా-చైనా దేశాల మధ్య వాణిజ్య ఒప్పందానికి అంగీకారం కుదిరింది.

Current Affairs

అమెరికా దిగుమతి చేసుకుంటున్న చైనా ఉత్పత్తుల విషయంలో తొలి దశ వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నట్లు చైనా డిసెంబర్ 13న ప్రకటించింది. వాణిజ్య, ఆర్థిక అంశాల పరంగా మొదటి దశ ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నట్లు వెల్లడించింది.

మరోవైపు అమెరికా, చైనాల మధ్య తొలిదశ వాణిజ్య ఒప్పందం కుదిరిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. 250 బిలియన్ డాలర్ల విలువైన చైనా ఉత్పత్తులపై 25శాతం సుంకం కొనసాగుతుందని, మరో 120 బిలియన్ డాలర్ల ఉత్పత్తులపై 7.5శాతం సుంకం అమలవుతుందని ట్రంప్ తెలిపారు. డిసెంబర్ 15న విధిస్తామని గతంలో ప్రకటించిన జరిమానా సుంకాలను ఉపసంహరిస్తున్నట్లు పేర్కొన్నారు. 2020 ఎన్నికల వరకు వేచి చూడకుండా, రెండోదశ ఒప్పంద చర్చలు ప్రారంభిస్తామని కూడా ట్రంప్ వెల్లడించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
 వాణిజ్య ఒప్పందానికి అంగీకారం
ఎప్పుడు : డిసెంబర్ 13
ఎవరు : అమెరికా-చైనా

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close