movie TeaserMovies

Acharya Teaser is out| ‘ఆచార్య’ టీజర్ విడుదల|

  • ‘ఆచార్య’ టీజర్ విడుదల
  • స్టైలిష్ లుక్ మరియు రఫ్ లుక్ లో కనిపిస్తున్న మెగా స్టార్
  • రామ్ చరణ్ వాయిస్ ఓవర్ తో టీజర్ మొదలు
acharya-teaser-is-out

Acharya Teaser is out:మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ టీజర్ మెగా అభిమానులకు గూస్ బంప్స్ ఇస్తుంది. 60 ఏళ్ల వయసులోనూ మెగాస్టార్ స్టైల్ చూస్తే ఫిదా కావాల్సిందే. అంత అందంగా, అద్భుతంగా ఉన్నారాయన. టీజర్‌పై మీరూ ఓ లుక్ వేయాల్సిందే.

మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని చూస్తున్న సమయం వచ్చింది. ‘ఆచార్య’ టీజర్‌తో మెగా అభిమానులకు కనువిందు తీసుకొచ్చారు మన మెగాస్టార్ చిరంజీవి. సోషల్ మెసేజ్‌తో కూడిన కమర్షియల్ సినిమాలు తీయడంతో సిద్దమైన కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న ఈ ‘ఆచార్య’ టీజర్‌ను శుక్రవారం సాయంత్రం 4:05 గంటలకు విడుదల చేశారు. ప్రస్తుతం ఈ టీజర్ ట్రెండింగ్‌లో ఉంది.

‘ఇతరుల కోసం జీవించే వారు దైవంతో సమానం. అలాంటి వారి జీవితాలే ప్రమాదంలో పడితే.. ఆ దైవమే వచ్చి కాపాడాల్సిన పనిలేదు’ అని రామ్ చరణ్ వాయిస్ ఓవర్‌తో ఈ టీజర్ మొదలైంది. అదే వాయిస్ ఓవర్‌తో ‘ఆచార్య’గా చిరంజీవి వైలెంట్ ఇంట్రడక్షన్ కూడా జరిగింది. టీజర్ చూసీ తప్పుడు చిరంజీవి హీరోయిజాన్ని కొరటాల శివ ఏ రేంజ్‌లో పెంచాడో అర్థమవుతోంది. చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తరవాత ‘ఖైదీ నంబర్ 150’, ‘సైరా నరసింహ రెడ్డి ’ సినిమాలు వచ్చినా.. ఎందుకో ఈ ‘ఆచార్య’ ఆయనకు కరెక్ట్ మూవీ అని టీజర్ చూస్తుంటే అర్ధమవుతుంది .

టీజర్‌లో చిరంజీవి స్టైల్, హీరోయిజం చూసి మెగా అభిమానులకు సంబరాలు చేసుకోవడం లో ఎలాంటి అనుమానాలు లేవు. అంత అందంగా, స్టైలిష్‌గా ఉన్నారు మెగాస్టార్. ఫైట్స్ కూడా మరొక స్థాయిలోఉంది. ఇక్కడ కూడా చిరంజీవి స్టైలే హైలైట్. ‘‘పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా అందరూ ఎందుకో ఆచార్య అంటుంటారు. బహుశా గుణపాఠాలు చెప్తాననేమో’’ అంటూ చిరంజీవి చెప్పే డైలాగ్ టీజర్‌కి మరో హైలైట్.ఈ టీజర్‌లో ప్రత్యేకంగా చెప్పాల్సింది మణిశర్మ నేపథ్య సంగీతం, తిరు సినిమాటోగ్రఫీ గురించి. ఈ రెండూ అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమా మెగాస్టార్ కెరీర్ లో ఒక్క కొత్త రికార్డు నిలుపుతుందన మాటలో ఈ సందేహం లేదు.

Acharya Teaser:

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close