TelanganaTelugu News
10వ తరగతి పాసైన విద్యార్థులకు అలర్ట్..
తెలంగాణలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ప్రవేశాలకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత మరియు ఆసక్తి కలిగిన విద్యార్థులు జూలై 5 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.
- మోడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్
- జులై 5 వరకు దరఖాస్తు ఛాన్స్
- జులై 10 ఆయా స్కూళ్లలో జాబితా ప్రదర్శన
తెలంగాణలోని పదవ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు గుడ్‌న్యూస్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 195మోడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రవేశాలకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. తెలంగాణలో ప్రభుత్వం నిర్వహిస్తున్న గురుకులాలు, మోడల్ స్కూళ్లు అత్యంత విజయవంతమైన విషయం తెలిసిందే. ఇక్కడ నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు అందిస్తుండడంతో ఆయా పాఠశాలల్లో చేరేందుకు విద్యార్థులు పోటీ పడుతున్నారు.
తాజాగా తెలంగాణలోని 194 మోడల్ స్కూళ్లలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ (ఇంగ్లిష్ మీడియం) ప్రవేశాలకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత, ఆసక్తి కలిగిన విద్యార్థులు జూలై 5 వరకు ఆన్‌లైన్‌లో అప్లయ్ చేసుకోవచ్చు. ఎంపికైన విద్యార్థుల జాబితాను ఆయా పాఠశాలల్లో జులై 10న ప్రదర్శిస్తారు. విద్యార్థులు పూర్తి వివరాలకు, అప్లయ్ చేసుకోవడానికి http://www.tsmodelschools.in/ వెబ్ సైట్ నుంచి పూర్తి సమాచారం పొందవచ్చు.