Latest Govt Jobs

సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాలు.. మ‌రో రెండు రోజులే గ‌డువు..!!


<![CDATA[

ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల‌ను క‌రోనా ప‌ట్టిపీడిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారి ధాటికి చిన్నా.. పెద్దా అని తేడా లేకుండా అన్ని దేశాలు అత‌లా కుత‌లం అవుతున్నారు. చైనాలో పుట్టుకొచ్చిన క‌రోనా వైర‌స్‌కు ఎప్పుడు.. ఎలా.. ఎక్క‌డ చెక్ పెట్టాలో తెలియ‌క దేశ‌దేశాలు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నాయి. ఇక చివ‌ర‌కు ప్రాణాంత‌క‌ర క‌రోనా మ‌హ‌మ్మారికి చెక్ పెట్టేందుకు ప‌లు దేశాలు లాక్‌డౌన్ విధించాయి. ఈ లాక్‌డౌన్ కార‌ణంగా ఎంద‌రో ఉద్యోగులు నిరుద్యోగులుగా మారుతున్నారు. అయితే ఇలాంటి స‌మ‌యంలోనూ భారతీయ రైల్వే ఖాళీల భర్తీ కొనసాగిస్తోంది. వేర్వేరు రైల్వే జోన్లు జాబ్ నోటిఫికేషన్లను విడుదల చేస్తున్నాయి. 

అయితే ఇటీవల రైల్వే విడుదల చేస్తున్న నోటిఫికేషన్లలో ఎక్కువగా పారామెడికల్, మెడికల్ పోస్టులు ఉంటున్నాయి. అలాగే సెంట్రల్ రైల్వే కూడా కాంట్రాక్ట్ మెడికల్ ప్రాక్టీషనర్, స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నాగ్‌పూర్‌లోని డివిజనల్ రైల్వే ఆస్పత్రిలో సేవలు అందించేందుకు ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఇవి మూడు నెలల తాత్కాలిక పోస్టులు మాత్రమే. ఇక ఈ నోటిఫికేష‌న్‌లో మొత్తం  38 ఖాళీలున్నాయి. అందులో కాంట్రాక్ట్ మెడికల్ ప్రాక్టీషనర్- 26, స్పెషలిస్ట్ (అనస్థీటిస్ట్)- 4, స్పెషలిస్ట్ (ఫిజీషియన్)- 4, స్పెషలిస్ట్ (ఇంటెసివిస్ట్)- 4 పోస్టులున్నాయి.

IHG

ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మ‌రిన్ని వివరాలను సెంట్రల్ రైల్వే అధికారిక వెబ్‌సైట్‌ https://cr.indianrailways.gov.in/ ఓపెన్ చేసి చూడొచ్చు. ఇక ఇప్ప‌టికే ఈ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు ప్రారంభ‌మైంది. అయితే ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 2020 మే 20 చివరి తేదీ. అంటే మరో రెండు రోజులే గడువుంది. ఆస‌క్తిగ‌ల అభ్య‌ర్థులు నోటిఫికేష‌న్ పూర్తి వివ‌రాలు తెలుసుకుని.. వెంట‌నే ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభించండి.

]]>


Source link

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close