Movie News

వారికి చేతులెత్తి దండం పెడుతున్నా: సినీ నటుడు రాజశేఖర్

[ad_1]

ప్రముఖ సినీ నటుడు .. వైద్యులకు, నర్సులకు ధన్యవాదాలు చెబుతున్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ గురించి ఆయన ఆసక్తికరమైన ట్వీట్ చేసారు. ‘‘ఈ వైరస్ అనే యుద్ధంలో సైనికుల్లా పోరాడుతున్న వైద్యులు, నర్సులు, హెల్త్ వర్కర్లకు చేతులెత్తి దండం పెడుతున్నా. ధన్యవాదాలు. మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది. మీ ఆరోగ్యం బాగుండాలని మేం ప్రార్థిస్తున్నాం’’ అని పేర్కొన్నారు. అయితే కరోనా వైరస్‌ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండండి అని ఇప్పటివరకు ఎందరో సెలబ్రిటీలు ట్వీట్స్ చేసారు. కానీ వైద్యులు, నర్సులను ఉద్దేశించి మాత్రం ఎవ్వరూ మాట్లాడలేదు.

రాజశేఖర్ కూడా ఓ వైద్యుడే కాబట్టి ఆయనకు వారి బాధ అర్థమైంది. కరోనా వైరస్ చైనాను వణికిస్తోంది. ఈ మహమ్మారి బారినపడి ఇప్పటి వరకూ 900 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం ఒక్క రోజే 97 మంది చనిపోయినట్టు చైనా ప్రకటించింది. దీంతో మృతుల సంఖ్య 908కి చేరింది. వైరస్ సోకిన బాధితుల సంఖ్య కూడా 40వేలు దాటింది. కొత్తగా మరో 2,973 మందికి వైరస్ సోకినట్టు చైనా జాతీయ ఆరోగ్య మిషన్ వెల్లడించింది. చనిపోయినవారు వైరస్‌కు కేంద్రస్థానమైన హుబే ప్రావిన్సుల్లోని వుహాన్ నగరం దాని పరిసర ప్రాంతాలకు చెందినవారే కావడం బాధాకరం.

READ ALSO:

మృతుల సంఖ్య 2002-03లో చైనాను కుదిపేసిన సార్స్ వైరస్ కన్నా ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మరిన్ని కరోనా కేసులు గుర్తించినట్టు డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ టెడ్రోస్ అధ్నామ్ ఘేబ్రియాసిస్ అన్నారు. చైనాలో పర్యటించని వారికి కూడా కరోనా వైరస్ సోకడాన్ని బట్టి ఇది ఎంత వేగంగా వ్యాప్తిచెందుతుందో అర్థమవుతోందన్నారు. వైరస్ వ్యాపించే దేశాలు దీనిని ఎదుర్కొడానికి అప్రమత్తంగా ఉండాలన్న ఆయన.. ప్రజలు మాత్రం ఆందోళన వీడి ప్రశాంతంగా ఉండాలన్నారు.

[ad_2]

Source link

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close