Blog

మరోసారి గగన్‌యాన్ మానవరహిత యాత్ర వాయిదా.. వచ్చే ఏడాది చివరిలోనే!


ప్రాజెక్టులో భాగంగా తొలి దశలో మానవరహిత ప్రయోగాన్ని ఈ ఏడాది డిసెంబరులో చేపట్టాలని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రణాళికలు సిద్ధం చేసింది. అయితే, కరోనా వైరస్ కారణంగా దీనిని వచ్చే ఏడాది ప్రథమార్ధానికి వాయిదా వేసిన విషయం తెలిసిందే. తాజాగా, ఈ ప్రయోగం మరోసారి వాయిదా పడింది. దీనిని వచ్చే ఏడాది చివరిలో నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో మానవసహిత అంతరిక్ష యాత్ర నిర్దేశిత సమయంలో పూర్తవుతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఇటీవల వాయిదా తర్వాత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 2021లో మానవరహిత మిషన్, డిసెంబరు 2021లో మానవసహిత యాత్ర చేపట్టాల్సి ఉంది. కానీ, మావనరహిత ప్రయోగం మళ్లీ వాయిదా పడింది. అయితే, మానవసహిత అంతరిక్ష యాత్రకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయని, వచ్చే ఏడాది ద్వితీయార్ధానికి ఇది పూర్తవుతుందని భావిస్తున్నామని శివన్ వెల్లడించారు.

‘మానవరహిత అంతరిక్ష మిషన్ కోసం పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో ఓ రోబోను రూపొందించాలని ఇస్రో ప్రణాళిక రూపొందించింది. మేము వచ్చే ఏడాది రెండు మానవరహిత మిషన్లను ప్రారంభించడం అనేది పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.. రాబోయే నెలల్లో ఏమి జరుగుతుందో దాని ఆధారంగా నిర్ణయించుకోవాలి. కోవిడ్-19 ప్రభావం మరింత కొనసాగితే, మేము మా ప్రణాళికలను పునఃసమీక్షించుకోవాల్సి ఉంటుంది’అని శివన్ వ్యాఖ్యానించారు.

‘ప్రముఖ ఇంజినీరింగ్‌ సంస్థ ఎల్‌ అండ్‌ టీ.. ఈ ప్రయోగానికి సంబంధించి మొదటి హార్డ్‌వేర్‌ బూస్టర్‌ విభాగాన్ని తయారు చేసింది. ప్రపంచంలోని మూడో అతిపెద్ద ఘన చోదక రాకెట్‌ బూస్టర్‌ మధ్య భాగం ఎస్‌-200ను అనుకున్న షెడ్యూల్‌ కన్నా ముందుగానే అందజేసింది. 3.2 మీటర్ల వ్యాసం, 8.5 మీటర్ల పొడవు, 5.5 టన్నుల బరువు ఉన్న ఈ బూస్టర్‌ను మానవసహిత ప్రయోగంలో ఉపయోగించన్నాం’ అని తెలిపారు.

మానవ అంతరిక్ష కార్యకలాపాలను ప్రారంభించడానికి 2022 గడువుకు చేరే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఇస్రో వర్గాలు తెలిపాయి. మహమ్మారి కారణంగా రష్యాలో నలుగురు వ్యోమగాముల శిక్షణ నిలిచిపోగా.. తిరిగి ఇటీవలే ప్రారంభమైంది. జీఎస్ఎల్వీ-మార్క్ఎం 3 ద్వారా 300-400 కిలోమీటర్ల తక్కువ ఎత్తున్న భూ కక్ష్యలో ఉంచుతారు. ఈ ప్రాజెక్టు కోసం రూ .10,000 కోట్ల ఖర్చుచేస్తున్నారు.


Source link

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close