Blog

భారతీయ శాస్త్రవేత్తలు మరో ఘనత.. చంద్రుడిపై నిర్మాణాలకు మూత్రం, యూరియాతో ఇటుకలు తయారీ


భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) పరిశోధకుల బృందం సంయుక్తంగా చంద్రునిపై ఇటుక లాంటి నిర్మాణాలను రూపొందించడానికి స్థిరమైన ప్రక్రియను అభివృద్ధి చేసింది. ఈ మేరకు వెల్లడించింది. ఇది చంద్రుడిపై మట్టిని అనుకూలంగా చేసుకుని, బ్యాక్టీరియా, గ్వార్ బీన్స్‌లను ఉపయోగించి నిర్మాణాలను ఏకీకృతం చేస్తుందని తెలిపింది. ఈ అంతరిక్ష ఇటుకలు చంద్రుని ఉపరితలంపై నివాసం కోసం నిర్మాణాలకు ఉపయోగపడతాయని పరిశోధకులు సూచించారు.

ఇది నిజంగా ఉత్తేజకరమైన విషయమని ఎందుకంటే రెండు వేర్వేరు రంగాలైన జీవశాస్త్రం, మెకానికల్ ఇంజినీరింగ్‌ను కలిపిందని పరిశోధనలో పాలు పంచుకున్న ఐఐఎస్సీ మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ అలోక్ కుమార్ అన్నారు.ఈ పరిశోధన వివరాలను సిరామిక్స్ ఇంటర్నేషనల్, పీఎల్ఓఎస్ ఒన్‌లో ప్రచురించారు.

గత శతాబ్దంలో అంతరిక్ష పరిశోధనల్లో గణనీయమైన పురోగతి సాధించారు. భూ గ్రహంలో వనరులు వేగంగా అంతరించపోవడంతో చంద్రుడు, ఇతర గ్రహాలపై నివాసానికి శాస్త్రవేత్తలు పరిశోధనలు ముమ్మరం చేశారు. ఒక పౌండు మెటీరియల్‌ను అంతరిక్షంలోకి పంపడానికి రూ.7.5 లక్షలు ఖర్చవుతుందని ఐఐఎస్సీ తెలిపింది.

చంద్రుని ఉపరితలంపై నిర్మాణానికి ఐఐఎస్సీ, ఇస్రో బృందం అభివృద్ధి చేసిన ఈ ప్రక్రియలో యూరియా, మానవ మూత్రం, చంద్రుడిపై మట్టిని ముడి పదార్థాలుగా ఉపయోగించారు. దీని వల్ల ఖర్చు బాగా తగ్గుతుందని, ఈ ప్రక్రియలో తక్కువ కార్బన్ వినియోగం కూడా ఉంటుంది ఎందుకంటే సిమెంటుకు బదులుగా గ్వార్ గమ్‌ను వినియోగిస్తారు. భూమిపై స్థిరమైన ఇటుకలను తయారుచేయడానికి కూడా దీనిని ఉపయోగించవచ్చని తెలిపింది.

జీవక్రియ ద్వారా కొన్ని సూక్ష్మజీవులు ఖనిజలవణాలను కూడా ఉత్పత్తి చేస్తాయి. ‘స్పోరోసార్సినా పాశ్చూరి’అనే బ్యాక్టీరియా యురియోలిటిక్ జీవక్రియ ద్వారా కాల్షియం కార్బోనేట్ క్రిస్టల్స్‌ను ఉత్పత్తి చేస్తుంది.. యూరియా, కాల్షియంలను ఉపయోగించి ఈ స్ఫటికాలను ఉపఉత్పత్తులుగా ఏర్పరుస్తుంది.

‘భూమిపై జీవపరిణామ క్రమం ప్రారంభమైనప్పటి నుంచి జీవులు ఇటువంటి ఖనిజ అవపాతంలో పాలుపంచుకున్నాయి.. ఆధునిక శాస్త్రం ఇప్పుడు వాటి ఉపయోగాన్ని కనుగొంది’ అని అలోక్ కుమార్ తెలిపారు.


Source link

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close