Latest Govt Jobs

తెలంగాణలో ఆ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. జీతం నెల రూ. 70 వేలు..!


<![CDATA[

తెలంగాణలో చాలా రోజుల తర్వాత కొన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది. కరోనా విజృంభిస్తున్న సమయంలో వైద్య సదుపాయాల మెరుగు కోసం తెలంగాణ సర్కారు వైద్యశాఖలో కొన్ని పోస్టులు భర్తీ చేయాలని తలచింది. తెలంగాణ‌లోని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల‌లో వైద్యుల నియామకానికి పచ్చజెండా ఊపింది. 

 

తెలంగాణ వైద్యశాఖ విజ్ఞప్తి మేరకు తెలంగాణ ఆర్థిక శాఖ కూడా ఇందుకు అనుగుణంగా  ఉత్తర్వులు జారీచేసింది.‌  దీని ప్రకారం.. మొత్తం 227 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లను కాంట్రాక్టు పద్దతిలో నియమిస్తారు. తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల్లోగ‌ల‌ పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల‌లో ఖాళీలను కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న ఆరు నెల‌ల కాలానికి భ‌ర్తీ చేస్తారు.

 

IHG

అంతే కాదు.. పీజీ ఫైన‌ల్ ఇయ‌ర్ చదువుతున్న వైద్య విద్యార్థులను ఏడాది ఒప్పందంతో సీనియర్ రెసిడెంట్లుగా నియమించాల‌ని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 1,191 మందిని సీనియ‌ర్ రెసిడెంట్లుగా నియ‌మించి, వారికి నెలకు రూ.70 వేల చొప్పున‌ వేతనం ఇస్తారట. ప్రస్తుతం కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న దృష్ట్యా  గాంధీ ఆస్పత్రిలో- 250 మందిని, కింగ్ కోఠి ఆస్పత్రిలో – 100 మందిని, గచ్చిబౌలి టిమ్స్‌లో- 150 మందిని, ఛాతీ ఆస్పత్రిలో- 50 మందిని, ఎనిమిది ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 50 మంది చొప్పున మొత్తం 400 మందిని నియమిస్తారు. 

 

ఇవి కాకుండా వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రులకు 241 మంది వైద్య విద్యార్థుల‌ను సీనియ‌ర్ రెసిడెంట్లుగా నియమించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా తెలంగాణ ఆర్థిక శాఖ  ఉత్తర్వులు జారీ చేసింది.  

]]>


Source link

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close