Latest Govt Jobs

ఎన్ఐటీలో 125 ఉద్యోగాలు.. పూర్తి వివ‌రాలు మీకోసం!!


<![CDATA[

ప్ర‌స్తుతం క‌రోనా క‌ష్టాలు ప్ర‌పంచ‌దేశాల‌ను వెంటాడుతున్నాయి. కంటికి కనిపించని ఈ మ‌హ‌మ్మారి దెబ్బకు అన్నిరంగాలు విలవిలలాడిపోతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతోంది. క‌రోనా కార‌ణంగా అనేక కంపెనీలు మూతపడ్డాయి. దీంతో ఉద్యోగులు నిరుద్యోగులుగా మారి.. రోడ్డున ప‌డుతున్నారు. అయితే ఈ క‌రోనా క‌ష్ట‌కాలంలో నిరోద్యోగుల‌ను ఆదుకునేందుకు ప‌లు కంపెనీలు ముందుకు వ‌స్తున్నారు. తాజాగా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-NIT కాలికట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

వాస్త‌వానికి ఈ నోటిఫికేష‌న్ ఎప్పుడో విడుద‌ల కావాల్సి ఉంది. కానీ,  లాక్‌డౌన్ కారణంగా పెండింగ్‌లో ప‌డింది. అయితే ఇప్పుడు అన్‌లాక్ ప్ర‌క్రియ ప్రారంభం కావ‌డంతో.. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా మొత్తం 125 నాన్ టీచింగ్ పోస్టులను భ‌ర్తీ చేస్తోంది. ఇక ఈ రిక్రూట్మెంట్ సంబంధించి పూర్తి వివరాలు చూస్తే ఈ విధంగా ఉన్నాయి. ఈ నోటిఫికేష‌న్‌లో మొత్తం ఖాళీలు 125 ఉన్నాయి. అయితే వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలు ఉన్నాయి. 

IHG

పూర్తి వివరాలను నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు. ఇంజనీర్లు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు.  ఇక ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2020 జూలై 20న ప్రారంభమైంది. ద‌ర‌ఖాస్తు చేయడానికి 2020 ఆగస్ట్ 5 చివరి తేదీగా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నోటిఫికేష‌న్‌లో వెల్ల‌డించింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అధికార వెబ్ సైట్  http://www.nitc.ac.in/  ఓపెన్ చేసి తెలుసుకోవ‌చ్చు. కాగా,  ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి అప్లికేషన్ కాపీని నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు పంపాల్సి ఉంటుంది. ఆస‌క్త‌గ‌ల అభ్య‌ర్థులు నోటిఫికేష‌న్ పూర్తి వివ‌రాల‌ను తెలుసుకుని.. ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌లెను.

]]>


Source link

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close