Latest Govt Jobs

అమెరికా దేశ విద్యారంగానికి పోటీగా ఎదగనున్న భారతదేశ విద్యారంగం..?!


<![CDATA[నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 విద్యా విధానం పై భారత దేశ వ్యాప్తంగా గత కొన్ని వారాలుగా అనేక చర్చలు జరుగుతున్నాయి. అండర్ గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ నిర్వహణ మార్పులపై హైకోర్టు లో కేసులు కూడా నమోదయ్యాయి. మరోవైపు రాజకీయ నేతలంతా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వలన భారతీయ విద్యార్థులందరూ ప్రపంచంలోని ఏ ప్రాంతంలోనైనా ఉద్యోగం సంపాదించగల నైపుణ్యాలను సంపాదించగలరని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

ప్రముఖ హార్వర్డ్ యూనివర్సిటీ లాగా హైదరాబాద్ లో కూడా తలపండిన ఉపాధ్యాయులతో బ్రహ్మాండమైన యూనివర్సిటీలకు శ్రీకారం చుట్టే రోజులు త్వరలోనే రానున్నాయని తెలంగాణ గవర్నర్ తమిళిసైసౌందర రాజన్‌ అన్నారు. చెన్నై, ముంబై, కోల్కతా, బెంగళూరు వంటి మహానగరాల్లో కూడా ఆక్స్ఫర్డ్ వంటి చాలా సమర్థవంతమైన, ఉన్నతస్థాయి యూనివర్సిటీలు ప్రారంభమవ్వనున్నాయని… నూతన విద్యా విధానం తో సరి కొత్తగా ప్రారంభమవుతోన్న భారతీయ విద్యార్థుల భవిష్యత్తు రాబోయే 40 సంవత్సరాల్లో పూర్తిస్థాయిలో మారిపోతుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.

ఏ భారతీయ విద్యార్థి కూడా చదివిన సమాధానాన్నే వంద సార్లు చదివి బట్టిపట్టే పరిస్థితి రాకుండా… టెక్నాలజీని ఉపయోగించి ప్రతి అంశాన్ని చక్కగా బోధించి.. ఒక్కసారి చదివితే ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేసే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 మెచ్చుకోదగినదని విద్యావేత్తలు చెబుతున్నారు. కేవలం పుస్తక పఠనం మాత్రమే కాకుండా ఎక్స్ట్రా కరిక్యులర్ ఆక్టివిటీస్ కూడా పూర్తిస్థాయిలో నేర్చుకునే అవకాశాన్ని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 కల్పించనున్నది. ఐతే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 లో ప్రతి ఒక్క అంశం మంచిగా ఉందని కానీ అవి కార్యాచరణలో పెట్టడం చాలా శ్రమతో కూడిన పని అని విద్యావేత్తలు అంటున్నారు. ఇకపోతే భారత ప్రభుత్వం ఈ నూతన విద్యా విధానాన్ని ఎలా కార్యాచరణలో పెడుతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.]]>


Source link

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close