Blog

అంతరిక్షాన్ని వాసన చూస్తారా? ఇదిగో ‘నాసా’ పెర్ఫ్యూమ్


పూల వాసన తెలుసు.. వంటల వాసన తెలుసు.. చివరికి మట్టి వాసన కూడా తెలుసు. ఇదేంటీ కొత్తగా? ‘అంతరిక్ష వాసన’ అనుకుంటున్నారా? అయితే, మీరు NASA రూపొందించిన ఈ సరికొత్త పెర్ఫ్యూమ్ గురించి తప్పకుండా తెలుసుకోవలసిందే. మనం ఇప్పటివరకు విమానమెక్కి గాల్లో మాత్రమే ఎగిరాం. అంతరిక్షానికి వెళ్లిన అనుభవం కేవలం వ్యోమగాములకు మాత్రమే ఉంది.

ఆ సూన్య ప్రదేశంలో నెలలపాటు జీవించే వ్యోమగాములకు అక్కడ వింతైన వాసన వస్తుందని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో ఒమెగా ఇంగ్రెడియంట్స్ కంపెనీ అధినేత, రసాయన శాస్త్రవేత్త స్టీవ్ పియర్స్‌కు సరికొత్త ఆలోచన వచ్చింది. అంతరిక్షంలో వచ్చే వాసనతో పెర్ఫ్యూమ్ తయారు చేస్తే ఎలా ఉంటుందని భావించాడు. ఈ విషయాన్ని నాసా అధికారులకు చెప్పాడు.

Also Read:

ఇదేదో ఆసక్తికరంగా ఉందని భావించిన నాసా ఆ పెర్ఫ్యూమ్ తయారీకి అనుమతి ఇచ్చింది. నాసా వ్యోమగాములు చెప్పిన వివరాలతో పియర్స్ ఆ పెర్ఫ్యూమ్‌ను తయారు చేశాడు. అంతరిక్షంలో వచ్చే వాసన తరహాలోనే పెర్ఫ్యూమ్ తయారు చేసి ఆశ్చర్యపరిచాడు. దానికి ‘ఈయూ డే స్పేస్’ (Eau De Space) అని పేరు పెట్టాడు. దీని సాయంతో వ్యోమగాములు అంతరిక్షంలోని ప్రమాదకర వాసనలను పసిగట్టవచ్చని పియర్స్ తెలిపాడు.

Also Read:

ఇంతకీ అంతరిక్షంలో వాసన ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉందా? అయితే, ఈ పెర్ఫ్యూమ్ తయారీకి సహకరించిన అమెరికా వ్యోమగామి పెగ్గీ విట్సాన్ చెప్పిన వివరాలు తెలుసుకోవల్సిందే. ‘‘అంతరిక్షంలో పొగలు కమ్ముకున్నట్లు, ఏదో కాలుతున్నట్లుగా వాసన వస్తుంది. అది ఎంతో వెగటు పుట్టిస్తుంది. నోటిలో చేదు అనిపిస్తుంది’’ అని తెలిపారు. మరి, ఈ పెర్ఫ్యూమ్ కావాలంటే.. మీరు కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.


Source link

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close