Latest Govt Jobs
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు రెండు రోజులే గడువు!!
<![CDATA[
ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచదేశాలకు విశ్వరూపం చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి దెబ్బకు అగ్రరాజ్యాలు సైతం కుదేల్ అవుతున్నాయి. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అటు పాజిటివ్ కేసుల సంఖ్య 1.50 లక్షలు మించిపోయింది. అయితే ఇలాంటి విపత్కర సమయంలో కృష్ణా జిల్లా విజయవాడలోని గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రిలో 161 పారామెడికల్ సిబ్బంది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, చైల్డ్ సైకాలజిస్ట్, రేడియోగ్రాఫర్ వంటి పోస్టులను భర్తీ చేయనుంది. వీటి పూర్తి వివరాలు చూస్తే.. మొత్తం 161 పోస్టుల్లో స్టాఫ్ నర్స్- 150, ల్యాబ్ టెక్నీషియన్- 2, చైల్డ్ సైకాలజిస్ట్- 1, రేడియోగ్రాఫర్-2, ఓటీ అసిస్టెంట్-6 ఖాళీలను నోటిఫికేషన్‌లో ప్రకటించింది. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ 2020 జూలై 25 సాయంత్రం 5 గంటలు.
ఇక నోటిఫికేషన్‌లో వేతనాల వివరాలు కూడా తెలిపింది. దాని ప్రకారం చూస్తే.. స్టాఫ్ నర్స్ రూ.34,000, ల్యాబ్ టెక్నీషియన్ రూ.28,000, చైల్డ్ సైకాలజిస్ట్ రూ.49,520, రేడియోగ్రాఫర్ రూ.30,660, ఓటీ అసిస్టెంట్ రూ.14,250 వేతనం లభించనుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలతో పాటు దరఖాస్తు ఫామ్ కోసం https://krishna.ap.gov.in/ వెబ్‌సైట్ చూడండి. దరఖాస్తుల్ని ఆఫ్‌లైన్‌లోనే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాగా, దరఖాస్తుకు మరో రెండు రోజులు మాత్రమే గడువు మిగిలి ఉంది కాబట్టి, ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే నోటిఫికేషన్ పూర్తి వివరాలను తెలుసుకుని.. వెంటనే దరఖాస్తు చేసుకోవలెను.
]]>
Source link