Blog

రాకెట్ల తయారీని పక్కనబెట్టి.. వెంటిలేటర్లు, శానిటైజర్ల రూపకల్పనలో ఇస్రో

[ad_1]

ఇప్పుడు యావత్ ప్రపంచం కరోనా వైరస్‌తో యుద్ధం చేస్తోంది. కరోనా వేగంగా వ్యాపించకుండా చూడటం కోసం భారత్ లాంటి దేశాలు లాక్‌డౌన్ చేపట్టాయి. కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరగకుండా చూడటం కోసం ఈ నిర్ణయం దోహదం చేసింది. ఇటలీ, స్పెయిన్, అమెరికా లాంటి దేశాల్లో కరోనా సామూహిక వ్యాప్తి దశకు చేరుకోవడంతో బాధితుల సంఖ్య, మరణాల సంఖ్య వేగంగా పెరుగుతోంది. భారత్‌ కరోనా సామూహిక వ్యాప్తి ముంగిట ఉండటంతో.. కేంద్రం, రాష్ట్రాలు హుటాహుటిన వెంటిలేటర్లు, అత్యవసర వైద్య పరికరాలను తెప్పించడంపై దృష్టి సారించాయి. కరోనా సోకిన వారిలో ఎక్కువ మంది శ్వాస తీసుకోవడంలో ఇబ్బండి పడుతుండటంతో.. ప్రభుత్వాలు భారీ సంఖ్యలో వెంటిలేటర్లకు ఆర్డర్ ఇచ్చాయి.

కాగా వెంటిలేటర్లు, శానిటైజర్ల రూపకల్పన కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ రంగంలోకి దిగింది. సులువుగా ఆపరేట్ చేసే వెంటిలేటర్ల డిజైనింగ్‌‌తోపాటు శానిటైజర్లు, మాస్కులు, ఆక్సిజన్ క్యానిస్టర్ల ఉత్పత్తి కోసం విక్రమ్ సారభాయ్ స్పేస్ సెంటర్‌లో రాకెట్ల తయారీ కార్యకలాపాలను ఇస్రో తాత్కాలికంగా పక్కన పెట్టింది. లాక్‌డౌన్ వేళ.. అత్యవసర పరిస్థితుల్లో, ప్రజల అవసరాలను తీర్చడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని ఇస్రో ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.

ఇస్రోకు చెందిన విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ కేరళలోని తిరువనంతపురంలో ఉంది. ఇక్కడ భారత, విదేశీ శాటిలైట్లను ప్రయోగించడం కోసం రాకెట్లకు రూపకల్పన చేస్తారు. కరెంట్ లేనప్పుడు కూడా సులభంగా ఆపరేట్ చేసేలా వెంటిలేటర్లకు డిజైనింగ్ చేస్తున్నామని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ సోమ‌నాథ్ మీడియాకు తెలిపారు. తాము గతంలో చేసిన పనికి ఇది భిన్నమైందన్నారు.

ఇప్పటి వరకూ ఇస్రో వెయ్యి లీటర్లకుపైగా శానిటైజర్లను రూపొందించింది. మాస్కులను కూడా తయారు చేస్తోంది. కరోనా నేపథ్యంలో ఉద్యోగులను ఇళ్ల నుంచి పని చేయాలని ఆదేశించామని సోమనాథ్ తెలిపారు. మరోవైపు డీఆర్‌డీవో కూడా కొద్ది వారాల వ్యవధిలోనే 30 వేల వెంటిలేటర్లను రూపొందించనుందని ఆ సంస్థ చీఫ్ డాక్టర్ సతీష్ రెడ్డి తెలిపారు.

[ad_2]

Source link

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close