Blog
మరో విన్యాసం సక్సెస్.. జాబిల్లి సమీపంలోని చివరిదైన ఐదో కక్ష్యలోకి చంద్రయాన్-3
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చంద్రుడిపై అధ్యయనానికి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-3 వ్యోమనౌక కక్ష్య మార్పు ప్రక్రియలు ఐదూ విజయవంతంగా ఇస్రో శాస్త్రవేత్తలు పూర్తిచేశారు. చివరిదైన విన్యాసం బుధవారం ఉదయం విజయవంతంగా పూర్తిచేసినట్టు ఇస్రో వెల్లడించింది. శ్రీహరికోట నంచి ప్రయోగించిన తర్వాత 18 రోజుల వ్యవధిలో దశలవారీగా ఐదుసార్లు దీని కక్ష్యను పెంచారు. భూకక్ష్య పూర్తయిన అనంతరం.. జాబిల్లి దిశగా ప్రయాణానికిగానూ ఆగస్టు 1న ట్రాన్స్ లూనార్ కక్ష్యలోకి వ్యోమనౌకను ప్రవేశపెట్టారు.
Source link