Blog

భూమి వైపు గ్రహశకలం.. మాస్క్ పెట్టుకుని మరీ దూసుకొస్తోంది!


భూమిపై కరోనా వైరస్ ఉందనే సంగతి గ్రహశకలాలకు కూడా తెలిసిపోయిందో ఏమో. మాస్కు పెట్టుకుని మరీ వస్తున్నాయ్. నమ్మబుద్ధి కావడం లేదా? అయితే, పై ఫొటోను చూడండి. నాసా పరిశోధకులు ట్వీట్ చేసిన ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముఖానికి ఫేస్ మాస్క్ ధరించినట్లుగా ఉన్న ఈ గ్రహ శకలాన్ని చూసి.. పాపం, వాటికి కూడా కరోనా వైరస్ భయం పట్టుకుందేమో అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.

ఎవరెస్టు శిఖరంలో సగం సైజు ఉన్న ఈ గ్రహశకాలంపై నిఘా పెట్టిన నాసా.. భూమికి అత్యంత సమీపంలోకి రానుందని గుర్తించారు. దీన్ని ‘1998 OR2’ నాటి గ్రహశకలంగా గుర్తించామని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. గ్రహశకలం వెడల్పు కనీసం 1.5 కిలోమీటర్లు ఉంటుందని అంచనా వేశారు. ఇది వచ్చేవారం భూమిని సమీపించవచ్చని భావిస్తున్నారు.

ప్యూర్టో రికోలోని అరేసిబో అబ్జర్వేటరీ రాడార్‌ ద్వారా ఆ గ్రహ శకలం ఫొటో తీసినట్లు నాసా పేర్కొంది. ఈ గ్రహశకాలాన్ని తొలిసారి 1998లో గుర్తించామని, అది అలా పరిభ్రమిస్తూ ఇప్పుడు భూమిని సమీపిస్తోందని తెలిపింది. అయితే, దీనివల్ల భూమికి ఎలాంటి ప్రమాదం ఉండబోదని, ఎప్పటికప్పుడు దీని గమనంపై నిఘా ఉంచామని వివరించింది. ఏప్రిల్ 29 తేదీకి ఇది భూమికి 3.9 మిలియన్ మైళ్ళ దూరానికి ప్రయాణించవచ్చని అంచనా వేసింది.

Also Read:


Source link

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close