Blog

భూమి, మార్స్ మాదిరిగానే చంద్రుడిపై ‘తుప్పు’.. వెల్లడించిన చంద్రయాన్-1 ఫోటోలు!


ఇప్పటి వరకూ భూమి, అంగారకుడిపై మాత్రమే వస్తువులకు తుప్పు పట్టడం గురించి తెలుసు.. కానీ, ప్రస్తుతం చంద్రుడిపై కూడా ఉన్నట్టు తాజాగా గుర్తించారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రుడిపై అధ్యయనానికి తొలిసారిగా 2008లో ప్రయోగించిన ఆర్బిటర్ పంపిన ఫోటోలను పరిశీలించి, దీని ఆధారంగా శాస్త్రవేత్తలు ఈ నిర్ణయానికి వచ్చారు. ఇనుము, నీరు ఆక్సిజన్‌‌తో చర్య జరిపినప్పుడు ఏర్పడే ఏర్పడే ఎర్రటి సమ్మేళనం తుప్పు.. దీనిని ఐరన్ ఆక్సైడ్ అని కూడా పిలుస్తారు. చంద్రుడి ఉపరితలంపై నీరు, ఆక్సిజన్ ఉనికి తెలియదు కాబట్టి ఇది ఆశ్చర్యకరమైన ఆవిష్కరణ.

కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. చంద్రుడి ఉపరితలంపై ధ్రువాల వద్ద తుప్పు పట్టవచ్చని ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-1 ఆర్బిటర్ పంపిన ఫోటోలు తెలియజేస్తున్నాయి. ఈ అన్వేషణకు సంకేతం ఏమిటంటే, చంద్రుడి ఉపరితలంపై ఇనుము అధికంగా ఉండే రాళ్లను కలిగి ఉన్నప్పటికీ, నీరు, ఆక్సిజన్ ఉనికి తెలియదు… ఇవి తుప్పును సృష్టించడానికి, ఇనుముతో సంకర్షణ చెందడానికి అవసరమైన రెండు అంశాలు’ అని అన్నారు.

భూమి సాధారణంగా హెమటైట్ ఏర్పడటానికి కారణమవుతుంది.. ఇది సాధారణంగా ఆక్సిజన్, నీరు అవసరమయ్యే తుప్పుకు కారణమని నాసా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. మొదట, నేను పూర్తిగా నమ్మలేదు.. చంద్రునిపై ఉన్న పరిస్థితులను బట్టి ఇది ఉండదు.. చంద్రునిపై నీటి ఆనవాళ్లు గుర్తించినప్పటి నుంచి ఆ నీరు రాళ్లతో ప్రతిచర్య జరిపి ఉంటే మనం తెలుసుకున్న దానికంటే ఎక్కువ రకాల ఖనిజాలు ఉండవచ్చు’ అని నాసా జేపీఎల్ శాస్త్రవేత్త అబిగెయిల్ ఫ్రేమన్ అన్నారు.

చంద్రయాన్-2 ప్రయోగం తుది మెట్టుపై విఫలం కావడంతో తదుపరి ప్రయోగంలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఇస్రో జాగ్రత్తలు తీసుకుంటోంది. అన్ని రకాలను పరీక్షలను నిర్వహించి, పూర్తి నమ్మకం ఏర్పడిన తర్వాతే చంద్రయాన్-3ని ప్రయోగించనున్నారు. ఇదే అంశంపై కేంద్ర మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ మాట్లాడుతూ.. చంద్రయాన్-2 మాదిరిగానే ల్యాండర్, రోవర్‌లు తాజా ప్రయోగాలు ఉంటాయి.. కానీ, ఆర్బిటర్ ఉండదన్నారు. ఈ ప్రయోగాన్ని 2021 ప్రథమార్ధంలో నిర్వహించే అవకాశం ఉందని తెలిపారు.


Source link

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close