Blog

పీఎస్ఎల్వీ సీ 49 ప్రయోగం సక్సెస్.. నింగిలోకి 10 ఉపగ్రహాలను పంపిన ఇస్రో


కరోనా వైరస్ కట్టడికి విధించిన లాక్‌డౌన్ తర్వాత తొలిసారి చారిత్రాత్మక ప్రయోగాన్ని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ () శనివారం విజయవంతంగా నిర్వహించింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోట సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి శనివారం పీఎస్‌ఎల్‌వీ సీ- 49 రాకెట్‌ను ప్రయోగించారు. శుక్రవారం మధ్యాహ్నం 1.02 గంటలకు మొదలైన కౌంట్‌డౌన్ 26 గంటల నిరంతరాయంగా కొనసాగింది. అనంతరం పీఎస్‌ఎల్వీసీ 49 నిప్పుల చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీహరికోటలో భారీ వర్షం కారణంగా నిర్ణీత సమయం కంటే ప్రయోగం 10 నిమిషాలు ఆలస్యంగా ప్రయోగం చేపట్టారు.

షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి సరిగ్గా మధ్యాహ్నం 3.12 నిమిషాలకు పీఎస్‌ఎల్‌వీ సీ- 49 రాకెట్‌ ద్వారా నింగిలోకి 10 ఉపగ్రహాలను పంపింది. ప్రయోగ కేంద్రం నుంచి బయలుదేరిన 13 నిమిషాల తర్వాత రాకెట్ నుంచి ఒక్కొక్కటిగా విడిపోయిన ఉపగ్రహాలు నిర్దేశిత కక్ష్యలోకి చేరాయి. తొలి దశలో ఈఓఎస్‌-01 అనే స్వదేశీ ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్‌‌ను కక్ష్యలో, మరో 9 విదేశీ ఉపగ్రహాలు ఉన్నాయి. కరోనా నేపథ్యంలో శాస్త్రవేత్తలు మినహా ఇతరులను షార్‌లోనికి అనుమతించ లేదు. పీఎస్‌ఎల్వీ సిరీస్‌లో ఇది 51వ ప్రయోగం కాగా, షార్‌ నుంచి 76వ ప్రయోగం కావడం గమనార్హం.

ఇక, ఆనవాయితీ ప్రకారం నమూనా రాకెట్‌కు తిరుమల శ్రీవారి ఆలయంలో ఇస్త్రో శాస్త్రవేత్తల బృందం శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ప్రయోగం ద్వారా ద్వారా భారత్‌కు చెందిన ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్‌ (ఈఓఎస్‌–01) అందుబాటులోకి రానుంది. వ్యవసాయం, అటవీ, ప్రకృతి వైపరీత్యాల అధ్యయనం కోసం సరికొత్తగా ఈ ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్‌ను రూపొందించినట్లు ఇస్రో వెల్లడించింది. వాస్తవానికి ఈ ప్రయోగాన్ని మార్చి 12న నిర్వహించాలని భావించినా కరోనా లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది. దాదాపు పది నెలల అనంతరం ప్రయోగం నిర్వహించారు.


Source link

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close