Latest Govt Jobs
నిరుద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్.. పరీక్ష లేకుండానే ఎస్‌బీఐలో ఉద్యోగం!
<![CDATA[
అవును.. కరోనా వేళా నిరుద్యోగులకు అద్భుతమైన శుభవార్త అందింది.. ఏంటి అని అనుకుంటున్నారా? అదేనండీ.. భారత దేశ అతి పెద్ద బ్యాంక్ (ఎస్బిఐ) భారతీయ స్టేట్‌బ్యాంకు 444 స్పెషలిస్టు ఆఫీసర్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఆసక్తి ఉన్న అభ్యర్థులు జులై 13లోగా దరఖాస్తు చేసుకోవాలి అని సూచించింది.
అయితే దరఖాస్తు చెయ్యాల్సిన విధానం.. వెబ్‌సైట్‌లో లాగిన్ అయి దరఖాస్తులు చేసుకోవాలి.. కాగా దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు ఇవే.. అభ్యర్థుల రెజ్యుమ్, గుర్తింపు, వయసు ధ్రువీకరణ పత్రాలు, విద్యార్హత, అనుభవానికి సంబంధించిన పత్రాలను దరఖాస్తు చేసే సమయంలో చెయ్యాల్సి ఉంటుంది.
ఇంకా ఇక్కడ మరో శుభవార్త ఏంటి అంటే దరఖాస్తు చేసిన అభ్యర్థులు ఎలాంటి పరీక్ష రాయనవసరం లేదు. ఎస్‌బీఐ కమిటీ అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి 100 మార్కులకు ముఖాముఖి నిర్వహిస్తుంది. ఇంకా అందులో అర్హత మార్కులను బ్యాంకు నిర్ణయిస్తుంది. ఏ ఇద్దరికైనా కటాఫ్ మార్కులు సమానంగా వస్తే వయసు ఆధారంగా ఎంపిక చేస్తారు.
మరి ఇంకేందుకు ఆలస్యం వెంటనే అప్లై చెయ్యండి. అయితే కరోనా వేళా ఉద్యోగాల కోసం అందరూ గాలిస్తుంటే ఎస్బిఐ ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చింది. మరి ఇంకేందుకు ఆలస్యం వెంటనే మీరు ఉద్యోగానికి అప్లై చేసుకోండి.. ఎస్బిఐలో ఉద్యోగం సాధించండి..
]]>
Source link