Latest Govt Jobs
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ శాఖలో కొత్తగా 3000 ఉద్యోగాలు..
<![CDATA[దేశం కరోనా ఉదృతి పెరుగున్న నేపథ్యం లో ఆర్థిక పరిస్థితి కూడా కిందకు దిగుతుంది. ఉద్యోగాలను కూడా చాలా మంది కోల్పోతున్నారు. ఈ మేరకు కొత్త కొత్త ఉద్యోగాల అవకాశాలను కల్పిస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ శాఖలో ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. తెలంగాణ నిరుద్యోగుల కు అదిరిపోయే గుడ్ న్యూస్ ను సర్కార్ అందించింది. రాష్ట్రంలో ఉన్న వైద్య విభాగం లో 3000 ఖాళీలు ఉన్నట్లు ప్రకటించింది. మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీల్లో ఔట్‌సోర్సింగ్ పోస్టుల కు సంబంధించిన పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు ఏడు మెడికల్ కళాశాలల్లో 2,135, 15 నర్సింగ్ కాలేజీల్లో 900 పోస్టులకు అనుమతినిస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
విషయానికొస్తే.. తెలంగాణ సర్కార్ మహబూబాబాద్, సంగారెడ్డి, జగిత్యాల, నాగర్‌కర్నూలు, వనపర్తి, కొత్తగూడెం, మంచిర్యాల పరిసర ప్రాంతాల్లో ఏడూ మెడికల్ కాలేజీలను, ఇక 13 నర్సింగ్ కాలేజీల ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేస్తున్న కాలేజీల లో ఉద్యోగాల ను భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు సంగారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల,మొదలగు జిల్లాలోని మెడికల్ కళాశాలల్లో మొత్తం 33 విభాగాలకు పలు రకాల ఉద్యోగాలను మంజూరు చేశారు.
ఈ ఉద్యోగాల విషయానికొస్తే.. స్టోర్ కీపర్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు, స్టెనో టైపిస్టులు, డార్క్ రూమ్ అసిస్టెంట్లు, రికార్డు క్లర్క్‌లు, రికార్డు అసిస్టెంట్లు, టెలిఫోన్ ఆఫరేటర్లు మొదలగు పోస్టులకు భర్తీ చేయన్నట్లు పేర్కొన్నారు. కొత్తగా రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న కాలేజీల్లో మొత్తం 900 ల పోస్టులకు దరఖాస్తులను కోరుతుంది. ఇది నిజంగానే తెలంగాణ నిరుద్యోగులకు అదిరిపొయె గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఒకేసారి చాలా మందికి ఉద్యోగాలు లభిస్తాయి.. ఇక కొంతవరకూ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తగ్గుతుంది..]]>
Source link