Latest Govt Jobs

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. లోక్‌సభలో ఉద్యోగాలు, వివ‌రాలు!!


<![CDATA[

ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల్లోనూ క‌రోనా కోర‌లు చాస్తున్న విష‌యం తెలిసిందే.  మూడు అక్షరాలే అయినా ముచ్చెటమలు పట్టిస్తోంది క‌రోనా. చైనాలో పుట్టుకొచ్చిన ఈ ప్రాణాంత‌క వైర‌స్‌.. అన‌తికాలంలోనే ప్ర‌పంచ‌దేశాలు క‌మ్మేసి ల‌క్ష‌ల మంది ప్రాణాల‌ను బ‌లితీసుకుంటోంది. లాక్‌డౌన్ విధించినా.. క‌ట్ట‌డికాని ఈ క‌రోనా.. అటు ప్ర‌జ‌ల‌కు, ఇటు ప్ర‌భుత్వాల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇక వ్యాక్సిన్ కూడా అందుబాటులో లేక‌పోవ‌డంతో.. క‌రోనా పేరు చెబితేనే భ‌య‌ప‌డ‌తున్నారు.

మ‌రోవైపు క‌రోనా కార‌ణంగా ఉద్యోగాలు పోగొట్టుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. అయితే ఇలాంటి స‌మ‌యంలో భారత పార్లమెంట్ ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తోంది. లోక్‌సభ సచివాలయం రిక్రూట్‌మెంట్ బ్రాంచ్ ట్రాన్స్‌లేటర్ పోస్టులు భ‌ర్తీ చేసేందుకు నోటిఫికేష‌న్ కూడా విడుద‌ల చేసింది.  ఈ నోటిఫికేష‌న్‌లో మొత్తం 47 ఖాళీలు ఉన్నాయి. విద్యార్హత విష‌యానికి వ‌స్తే.. హిందీలో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. డిగ్రీ స్థాయిలో ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉండాలి. లేదా ఇంగ్లీష్‌లో మాస్టర్స్ డిగ్రీ ఉంటే డిగ్రీ స్థాయిలో హిందీ సబ్జెక్ట్ చదివి ఉండాలి.

IHG

అలాగే హిందీ నుంచి ఇంగ్లీష్, ఇంగ్లీష్ నుంచి హిందీకి డిప్లొమా / సర్టిఫికెట్ కోర్స్ ఇన్ ట్రాన్స్‌లేషన్ సర్టిఫికెట్ ఉండాలి. అంతేకాదు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, సచివాలయాల్లో 2 ఏళ్లు ట్రాన్స్‌లేషన్ వర్క్స్ చేసి ఉండాలి. నోటిఫికేషన్ పూర్తి వివ‌రాల‌ కోసం https://loksabha.nic.in/ వెబ్‌సైట్ చూడండి.
ఇక ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ఇప్ప‌టికే ప్రారంభ‌మైంది. ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి చివ‌రి తేదీ 2020 జూలై 27. అంటే మ‌రో ద‌ర‌ఖాస్తుకు మ‌రో మూడు రోజులు మాత్ర‌మే గ‌డువు మిగిలి ఉంది. ఆస‌క్తిగ‌ల అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు పూర్తివివ‌రాల‌ను తెలుసుకుని.. ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌లెను. కాగా, ఈ పోస్టుల‌కు రాతపరీక్ష ద్వారా ఎంపిక చేయ‌నున్నారు.

]]>


Source link

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close