Blog
నాలుగో విన్యాసం సక్సెస్.. జాబిల్లికి కేవలం 177 కి.మీ. దూరంలో చంద్రయాన్-3
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన చంద్రయాన్-3.. జాబిల్లి ఉపరితలానికి మరింత చేరువైంది. సోమవారం ఈ వ్యోమనౌక కక్ష్య తగ్గింపు విన్యాసాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా పూర్తిచేసింది. బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ (ఇస్ట్రాక్) నుంచి ఆదేశాలు పంపి వ్యోమనౌకను మెల్లగా ఎత్తును తగ్గిస్తూ వస్తున్నారు. ఆగస్టు 5న చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించిన తర్వాత నుంచి ఇప్పటి వరకూ నాలుగు దఫాలుగా విన్యాసాలు పూర్తయ్యాయి.
Source link