Blog

దేశవ్యాప్తంగా ఖగోళ అద్భుతం.. తిలకించేందుకు ఉత్సాహం చూపుతున్న ప్రజలు


ఈ ఏడాది తొలి ఆదివారం ప్రపంచ వ్యాప్తంగా కనువిందు చేస్తోంది. ఉదయం 9.16 గంటల నుంచి రాహుగ్రస్త సూర్యగ్రహణం ఆరంభం కాగా.. భారత్‌లో తొలుత గుజరాత్‌లోని ద్వారకలో మొదలయ్యింది. ఉదయం 10.14 గంటలకు గ్రహణం అక్కడ ఆరంభమయ్యింది. మరి కాసేపట్లో గగనతలంలో అరుదైన సుందరదృశ్యం కనువిందుచేయనుంది. ఈ గ్రహణాన్ని చూడటానికి దేశవ్యాప్తంగా పలుచోట్ల జనం ఉత్సాహం చూపుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లోని తెలంగాణలో ఉదయం 10.15 గంటలకు, ఆంధ్రప్రదేశ్‌లో ఉదయం 10.21 గంటలకు గ్రహణం మొదలైనట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. తెలంగాణలో 51 శాతం, ఏపీలో 46 శాతం కనిపిస్తుందని వివరించారు. గ్రహణం కారణంగా భూమిపైకి వచ్చే అతి నీలలోహిత కిరణాల వల్ల కరోనా వైరస్‌ కొంతమేరకు (0.001 శాతం) నశించే అవకాశం ఉందన్నారు.

ఉత్తరాఖండ్‌లోని జోషీమఠ్‌, డెహ్రాడూన్‌ తదితర ప్రాంతాల్లో సంపూర్ణ సూర్యగ్రహణం కనువిందు చేస్తోంది. హైదరాబాద్‌తోపాటు మిగతా చోట్ల పాక్షికంగానే కనిపిస్తుందన్నారు. సూర్యగ్రహణాన్ని నేరుగా, ఎక్స్‌రే ఫిలిం, నల్లని గాజు ముక్కల ద్వారా చూడడం ప్రమాదకరమని తెలిపారు. వైద్యులు సూచించిన ఎక్లిప్స్‌ అద్దాలతోనే గ్రహణాన్ని చూడాలని సూచించారు.

భూమి నుంచి భూమి అత్యంత దూరంలో ఉండే ప్రదేశాన్ని అపోజీగా పిలుస్తారు. చంద్రుడు అపోజీలో ఉన్నప్పుడు, భూమిపైకి సాధారణం కంటే కాస్త చిన్నగా కనిపిస్తాడు. ఆ తరుణంలో సూర్యగ్రహణం ఏర్పడితే, సూర్యుడిని చంద్రుడు పూర్తిగా అడ్డుకోలేని పరిస్థితి ఉంటుంది. చంద్రబింబం మూసినంత మేర మూయగా.. దాని చుట్టూ కనిపించే సూర్యబింబం మండుతున్న ఉంగరంలా కనిపిస్తుంది. దీన్నే ‘యాన్యులర్‌’ లేదా వలయాకార గ్రహణంగా పేర్కొంటారు.

‘యాన్యులర్‌’ అనే పదం ‘యాన్యులస్‌’ అనే లాటిన్ పదం నుంచి పుట్టింది. దీనికి ఉంగరం అని అర్థం. ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా ఖండాల్లో, హిందూ, పసిఫిక్‌ మహాసముద్రాల్లోని దీవుల్లో, ఐరోపాలోని కొన్ని ప్రాంతాల్లో ఈ గ్రహణం కనువిందు చేస్తోంది. రాజస్థాన్, హర్యానా, ఉత్తరాఖండ్ కారిడార్ వెంట గరిష్టంగా 30 సెకన్ల పాటు ముత్యాల హారంగా సూర్యుడు కనిపిస్తాడు.

ఈ గ్రహణం సమయంలో సూర్యుడి కరోనా, సౌర డిస్క్ చుట్టూ ఒక ప్రకాశవంతమైన దృశ్యంలా కనిపించింది. కాగా, ఇలాంటి అరుదైన ఘటన మళ్లీ 2031లోనే భారత్‌లో ఏర్పడనుందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు.


Source link

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close