Latest Govt Jobs
త్వరలో కేంద్ర సాయుధ బలగాల్లో ఉద్యోగాలు..!
<![CDATA[నిరుద్యోగులకు శుభవార్త. కేంద్ర బలగాలలో ఉద్యోగాలు చేయాలనుకునేవారికి గుడ్ న్యూస్. కేంద్ర హోం శాఖ నిర్వహణలో ఉన్న సాయుధ బలగాల లో 1522 కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. సాయుధ బలగాలు లోని ఓ విభాగమైన సశస్త్ర సీమా బల్ లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇక కార్పెంటర్ ప్లంబర్ వెయిటర్ లాంటి వివిధ పోస్టుల కలుపుకుని మొత్తం 1541 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇక ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను వెబ్ సైట్ లో చూడగలరు. అలాగే నోటిఫికేషన్ విషయానికి వస్తే.. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు న్యూస్ పేపర్ లో విడుదల కానుంది. ఇలా విడుదలైన రోజు నుండి 30 రోజులలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ ఉద్యోగాలకు విద్యార్హతను చూస్తే వివిధ పోస్టులకు వివిధ రకాల విద్యా అర్హతలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైన తర్వాత పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఇక వీరి వేతనాలు రూ 21, 700 నుండి రూ.69,100 మధ్యలో ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైన తర్వాత పరీక్ష ఫీజు జనరల్ అభ్యర్థులకు, బిసి అభ్యర్ధులకు 100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ మహిళలు ఎక్స్-సర్వీస్మెన్ వారికి ఎలాంటి ఫీజు లేదు.
ఇక ఇందులో భర్తీ చేసే ఉద్యోగాల ఖాళీల వివరాలు ఒకసారి చూస్తే…
మొత్తం ఖాళీలు- 1522
డ్రైవర్- 574
కుక్ మేల్- 232
వెటర్నరీ- 161
వాటర్ క్యారియర్ మేల్- 101
వాషర్‌మ్యాన్ మేల్- 92
సఫాయివాలా మేల్- 89
బార్బర్ మేల్- 75
వాషర్‌మ్యాన్ ఫీమేల్- 28
సఫాయివాలా ఫీమేల్- 28
ల్యాబ్ అసిస్టెంట్- 21
కుక్ ఫీమేల్- 26
ఆయా (మహిళలు)- 5
కార్పెంటర్- 3
ప్లంబర్- 1
పెయింటర్- 12
టైలర్- 20
కోబ్లర్- 20
గార్డెనర్- 9
బార్బర్ ఫీమేల్- 12
వాటర్ క్యారియర్ ఫీమేల్- 12
వెయిటర్ మేల్- 1
పోస్ట్ వివరాలు పైన తెలిపిన విధంగా ఉన్నాయి.
]]>
Source link