Blog
తొలిసారిగా.. మనుషులపై కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలు షురూ
సోమవారం తొలిసారిగా ఓ వాలంటీర్‌కు కరోనా వ్యాక్సిన్‌ను ఇచ్చారు. ఈ వ్యాక్సిన్ సురక్షితమేనా కాదా అని తొలి దశలో తేలుస్తారు. ఇవి సేఫ్ అని తేలితే తర్వాతి దశలో అది ఎలా పని చేస్తుందో గుర్తిస్తారు. హ్యుమన్ ట్రయల్స్‌ను రికార్డు సమయంలో ప్రారంభించామని ఎన్ఐహెచ్ డైరెక్టర్ డాక్టర్ ఆంథోనీ ఫౌసీ తెలిపారు.
ఒకవేళ ఈ వ్యాక్సిన్ సురక్షితమని తేలినప్పటికీ… వైరస్‌పై సమర్థవంతంగా పని చేస్తుందని నిరూపితమైనప్పటికీ.. కనీసం ఏడాది వరకు ఇది మార్కెట్లోకి అందుబాటులోకి రాదు. సియాటెల్‌లోని కైజర్ పర్మనెంటే వాషింగ్టన్ హెల్త్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. మోడెర్నా సంస్థ వ్యాక్సిన్ తయారీకి జెనెటిక్ మెటీరియల్ – మెసేంజర్ ఆర్ఎన్ఏను ఉపయోగించింది. వైరస్‌లను అరికట్టడం కోసం ఈ సంస్థ తయారు చేస్తున్న మరో తొమ్మిది రకాల వ్యాక్సిన్లు వివిధ దశల్లో ఉన్నాయి. కానీ ఈ టెక్నాలజీతో రూపొందించిన ఏ వ్యాక్సిన్ కూడా ఇప్పటి వరకూ మార్కెట్లోకి రాలేదు. ఆర్ఎన్ఏ అప్రోచ్‌తో వ్యాక్సిన్‌ను వేగంగా రూపొందించొచ్చనే ఉద్దేశంతో మోడెర్నాతో ఎన్ఐహెచ్ కలిసి పనిచేస్తోందని వ్యాక్సిన్ రీసెర్చ్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ బెర్నీ గ్రాహం తెలిపారు.
Source link