Latest Govt Jobs

తరగతుల నిర్వహణ పై కీలక నిర్ణయం తీసుకున్న ఉస్మానియా యూనివర్సిటీ..!!


<![CDATA[జవహార్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ నిన్నటికి నిన్న వెల్లడించిన సమాచారం ఏమిటంటే.. ఫిబ్రవరి 13వ తేదీ కళాశాలలలో తరగతులు ప్రారంభించడానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని వెల్లడించింది. అంతేకాదు ఫిబ్రవరి ఒకటవతారీకు నుంచి కళాశాలలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిన విషయం తెలిసిందే.. ఉస్మానియా యూనివర్సిటీ మాత్రం ఇందుకు భిన్నంగా కీలక నిర్ణయం తీసుకోవడంతో పలు చోట్ల పలు రకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి.

కరోనా థర్డ్ వేవ్ కారణంగా విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని విద్యా సంస్థలన్నీ మూసివేసిన విషయం తెలిసిందే.. అయితే ఈ నేపథ్యంలోనే చాలావరకు విద్యాసంస్థలు పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ విధానంలో తరగతులను నిర్వహిస్తున్నారు.. ఇక సంక్రాంతి తర్వాత తెలంగాణలో అన్ని విద్యా సంస్థలకు కూడా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం ఆన్లైన్ క్లాసులు నిర్వహణకు అనుమతి కూడా ఇచ్చింది. ఇదిలా ఉండగా తాజాగా రాష్ట్రంలో ఉన్న అన్ని పాఠశాలలను ఫిబ్రవరి ఒకటో తారీకు నుంచి ప్రారంభించాలని సర్కారు నిర్ణయం తీసుకున్న ఉస్మానియా యూనివర్సిటీ మాత్రం ఆన్లైన్ క్లాసులు కొనసాగింపుకే మొగ్గు చూపుతూ ఉండడం గమనార్హం..

ఇకపోతే ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి రాష్ట్రంలో ఉన్న అన్ని విద్యా సంస్థలు ప్రారంభం కావాల్సి ఉన్న నేపథ్యంలో ఆన్లైన్ తరగతులను పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడంపై రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి.. అంతేకాదు ఫిబ్రవరి 12వ తేదీ వరకు పీజీ, యూజీ అన్ని సెమిస్టర్ లకు సంబంధించి ఆన్లైన్ పాఠాలు కొనసాగించాలని ప్రకటన కూడా జారీ చేసింది.. అంతేకాదు కరోనా నేపథ్యంలో ఇంకా కొన్ని రోజుల పాటు ఆన్లైన్ విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.. యూనివర్సిటీ పరిధిలో ఉన్న అన్ని కాలేజీలు ప్రిన్సిపాల్ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులకు మాత్రమే ఆన్లైన్ క్లాసులు ఉపాధ్యాయులు మాత్రం అక్కడి నుంచి ఆన్లైన్ క్లాసులు పిల్లలకు బోధించాలని స్పష్టం చేశారు.]]>


Source link

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close