Latest Govt Jobs

డిగ్రీ అర్హ‌త‌తో  ప్ర‌భుత్వ ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!!


<![CDATA[

ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల‌ను క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ ప్రాణాంత‌క‌ర మ‌హ‌మ్మారికి వ్యాక్సిన్ లేక‌పోవ‌డంతో.. నివార‌ణ‌పైనే అన్ని దేశాలు ఫోకస్ చేశాయి. వైరస్ సోకకుండా ఉండేందుకు, సోకిన తర్వాత ఇతరులకు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభుత్వాలు కీలక సలహాలు, సూచనలు ఎప్ప‌టిక‌ప్పుడు చేస్తూనే ఉన్నాయి. అలాగే క‌రోనాను నివారించేందుకు ప‌లు దేశాలు లాక్‌డౌన్ విధించాయి. దీంతో ప‌లు సంస్థ‌లు శాశ్వ‌తంగా మూత‌ప‌డ‌డంతో.. ఎంద‌రో ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. 

అయితే ఇలాంటి స‌మ‌యంలో భార‌త ప్ర‌భుత్వ ర‌సాయ‌నాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ‌కు చెందిన సెంట్ర‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాల‌జీ (సిపెట్‌) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 57 టెక్నికల్‌, నాన్‌ టెక్నికల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేష్ బ‌ట్టీ చూస్తే.. మొత్తం 57 పోస్టులు ఉండ‌గా.. అందులో సీనియ‌ర్ ఆఫీస‌ర్‌-04, ఆఫీస‌ర్‌-06, టెక్నిక‌ల్ ఆఫీస‌ర్‌-10, అసిస్టెంట్ ఆఫీస‌ర్‌-06, అసిస్టెంట్ టెక్నిక‌ల్ ఆఫీస‌ర్‌-10, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్‌-06, టెక్నిక‌ల్ అసిస్టెంట్‌-15 ఖాళీలు ఉన్నాయి.

<img src="https://akm-img-a-in.tosshub.com/sites/btmt/images/stories/jobs-505_050219053856.jpg?size=1200:675" alt="IHG's <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=DIGITAL wallet PLATFORM’ target=’_blank’ title=’digital-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ‘>digital revolution generating?” />

ఇక ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ఇప్ప‌టికే ప్రారంభ‌మైంది. అర్హులైన అభ్యర్థులు మే 29లోగా ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష లేదా ప్రాక్టికల్ టెస్ట్‌ లేదా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇక పోస్టును బట్టి సంబంధిత స‌బ్జెక్టుల్లో బ్యాచిల‌ర్స్ డిగ్రీ, బీఈ/ బీటెక్‌, ఎంఈ/ ఎంటెక్‌, ఎంబీఏ, పీజీ డిగ్రీ ఉత్తీర్ణ‌త ఉండాలి. మ‌రియు కనీస అనుభవం మూడేళ్లు ఉండాలి. కమ్యూనికేషన్‌, ప్రభుత్వ నియమ నిబంధనలపై అవగాహన, మోడరన్‌ మేనేజ్‌మెంట్‌ స్కిల్స్ ఉంటే ఇంకా మంచిది. ఈ నోటిఫికేష‌న్ మ‌రిన్ని వివ‌రాల కోసం https://www.cipet.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవ‌చ్చు. ఇక ఆస‌క్తిగ‌ల అభ్య‌ర్థులు వెంట‌నే ద‌ర‌ఖాస్తు చేసుకోండి.

]]>


Source link

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close