Latest Govt Jobs
డిగ్రీ అర్హతతో బ్యాంక్ ఉద్యోగాలు.. అస్సలు మిస్ అవ్వకండి..!!
<![CDATA[
బ్యాంక్ ఉద్యోగం పొందాలని చాలా మంది కలలు కంటుంటారు. బ్యాంకుల్లో ఉద్యోగం సొంతం చేసుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే బ్యాంకు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్‌న్యూస్ అందించింది. ఎందుకంటే.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీగా ఉద్యోగాల భర్తీకి చేయనుంది. ఈ క్రమంలోనే నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో ఏకంగా 3850 ఖాళీలను ప్రకటించింది. సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. వీటి పూర్తి వివరాలను పరిశీలిస్తే..
మొత్తం 3850 ఖాళీలు ఉండగా.. అందులో తెలంగాణ- 550, గుజరాత్- 750, కర్నాటక- 750, మధ్యప్రదేశ్- 296, చత్తీస్‌గఢ్- 104, తమిళనాడు- 55, రాజస్తాన్- 300, మహారాష్ట్ర- 517 మరియు గోవా- 33 పోస్టులు ఉన్నాయి. విద్యార్హత విషయానికి వస్తే ఏదైనా డిగ్రీ లేదా తత్సమాన అర్హత ఉండాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్‌లో తెలిపింది. అలాగే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 2020 ఆగస్ట్ 1 నాటికి 30 ఏళ్ల లోపు ఉండాలని తెలిపింది.
ఇక ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2020 జూలై 27న అంటే నేటి నుంచి ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 2020 ఆగస్ట్ 16గా నిర్ణయించింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే.. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు రూ.750 ఫీజు చల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు మాత్రం ఎలా ఫీజు చల్లించాల్సిన అవసరం లేదు. దరఖాస్తుల షార్ట్‌లిస్టింగ్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. కాగా, ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.sbi.co.in/web/careers/ వెబ్‌సైట్ ఓపెన్ చేసి తెలుసుకోవచ్చు. అసక్తిగల అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తి వివరాలను తెలుసుకుని దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
]]>
Source link