Latest Govt Jobs
జేఈఈ, నీట్ మాక్ టెస్టుల కోసం యాప్.. !?
<![CDATA[
ఇంటర్ పరీక్షలు అయ్యాయి.. ఇంకా కాంపిటీటివ్ పరీక్షలు ఖచ్చితంగా ఉంటాయి.. అలాంటి కాంపిటీటివ్ పరీక్షలకు అందరూ ప్రిపేర్ అవుతున్నారు. జేఈఈ, నీట్ పరీక్షలు వచ్చే నెలలో జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయితే అలాంటి కాంపిటీటివ్ పరీక్షలను ప్రాక్టీస్ చేసుకునేందుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మాక్ టెస్టులను అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఇంకా ఆ యాప్ పేరు నేషనల్ టెస్ట్ అభ్యాస్. ఈ యాప్ ను ఇప్పుడు పిల్లల కోసం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని కేంద్రం తెలిపింది. ఇంకా https://nta.ac.in/abhyas వెబ్ సైట్ లో కూడా విద్యార్థులు పరీక్షా ప్రాక్టీస్ చేసుకోవచ్చు.
అంతేకాదు జులై తొలి వారంలో హాల్‌టికెట్లు అందుబాటులోకి వస్తాయి. జులై 18వ తేదీ నుండి 23వ తేదీ వరకు ఈ జేఈఈ మెయిన్ పరీక్షలు జరగనున్నాయి. అయితే ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు జూలై మొదటి వారంలో హాల్‌టికెట్లను జారీ చేసేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏర్పాట్లు పూర్తి చేస్తుంది. కాగా ఏప్రిల్ లో జరగాల్సిన ఈ నీట్ పరీక్షలు కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా వాయిదా పడి ఇప్పుడు జులైలో జరుగుతున్నాయి.
ఇంకా ఈ పరీక్షలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక షిఫ్ట్, మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు రెండో షిప్ట్ పరీక్ష జరగనుంది. ఇంకా పరీక్షకు 15 రోజులు ఉంది అనే ముందు హల్ టికెట్లు విడుదల కానున్నాయి.
]]>
Source link