Blog
జాబిల్లికి మరింత చేరువగా చంద్రయాన్-3.. కేవలం 1,437 కి.మీ. దూరంలో వ్యోమనౌక
జాబిల్లిపై పరిశోధనలకు ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3లోని అన్ని వ్యవస్థలూ ఇప్పటి వరకూ సక్రమంగా పనిచేస్తున్నాయి. ప్రస్తుతం స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడికి 1,500 కి.మీ. దూరంలోపు ఉంది. కొద్దిరోజుల్లో చంద్రుడి చుట్టూ ఉన్న 100 కిలోమీటర్ల వృత్తాకార కక్ష్యలోకి స్పేస్ క్రాఫ్ట్ ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి చంద్రుడికి మరింత చేరువయ్యే క్రమంలో కక్ష్య నిర్ధారణ ప్రక్రియ చాలా కీలకం కానుంది. 100 కిలోమీటర్ల వరకూ ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆ తర్వాత ప్రక్రియ చాలా సవాల్‌తో కూడుకున్నది.
Source link